మనిషి పిచ్చికి అంతే లేదు.....
నమ్మకం మంచిదే కాని... నువ్వు నమ్మిన ఆ నమ్మకమే నిన్ను సర్వ నాశనం చేస్తున్నప్పుడు ఇంకా దానినే పట్టుకు వేలాడుతా అనుకోవటం ఒక అతి మూర్కత్వం ..
సమాజం లో చదువు రాని మూర్కుల కన్నా చదువుకున్న మూర్కుల వల్లే చాల ప్రమాదం. వాడు చదవక ఉపయోగం లేదు వీడు చదివి ఉపయోగం లేదు. దేవుడే లేకపోతె ఈ సృష్టి ఎలా జరిగింది ? ఈ జంతుజాలం ఎలా పుట్టింది ? ఇవి తరచుగా వినిపించే ఎదవ ప్రశ్నలు... వీటికి ఎవరికీ ఆధారాలతో కూడిన సమాధానాలు లేవుగాని ఒక్కటి నిజం... అదే మన మూర్కత్వం , మన మూర్కత్వం వల్లే జరగనివి సాధ్యం కానివి , అంతు చిక్కనివి జరుగుతాయని నమ్మటం ఎదో ఒక పిచ్చిలో బ్రతికేయటం.
దేవుణ్ణి సృష్టించింది మనిషే ఇది నిజం , దేవుని చేతికి మాయలు మంత్రాలు ఇచ్చింది మనిషే, మనకి ప్రాచుర్యం లో ఉన్న అన్ని మత గ్రంధాలు , దేవుని ఉనికిని ప్రస్తావించే అన్ని పుస్తకాలు, కథలు , మనిషి చేత రాసినవే. ఆ రాసిన మనిషి రాసిన కారణం , దాని ఫలితం మనకి తెలియదు గాని అప్పటి పరిస్థితుల్లో వారి బతుకుదెరువు కోసం అయి ఉండొచ్చు గాని.. ఈ నవీన సమాజం లో దేవుడు దెయ్యాలు ఒక అనాగరిక చర్యలు. మూర్కత్వపు పోకడలు, ఆలోచించలేని అజ్ఞానము. కాలయాపన , సోమరితనం , మన కష్టాల్ని ఇంకొకరి మీద వేసేసి చేతులు దులిపెసుకోవాలనుకోవటం ఇది తప్పించి దేవుని వల్ల మానవాళికి కలిగే ఒక్క ఉపయోగం కూడా శాస్త్రీయంగా ఇప్పటికి ఎవరు నిరుపించలేక పోయారు. ఇక నిరుపించలేరు కూడా....
దేవుని మాయలో పెట్టుబడిదారులు ప్రజల్ని చేసే మోసాలు అన్ని ఇన్ని కాదు, వాటిని ఒక్కొకటి చెప్పుకుంటూ పోతే facebook లో పేజీలు చాలవు... మన జీవితం సరిపోదు. దేవుడు లేకుండా మతం మనుగడ సాదించలేదు, మతం అంటే ఒక మూర్కత్వం, మతాలు పోటీ పడటం ఎలాగో తెలుసా ? మా మూర్కత్వం గొప్పది అంటే మా మూర్కతం గొప్పది అని. ఈ పిచ్చి ఇప్పుడు పరాకాష్టకి చేరి ఎవరినైతే వుద్దరించాటానికి మతం పుట్టిందో వారిని సమూలంగా సర్వనాశనం చేయడం మొదలయ్యింది. దేవుడి కోసం అమూల్యమయిన అత్యంత విలువయిన ఈ మనిషి పుట్టుకను నిలువునా చంపేసుకోవడం మూర్కత్వం లో మొదటి మూర్కత్వం...
మతాల పేరిట జరిగే మారనకాండలు , మతాల పేరిట జరిగే దారుణాలు వాటిని గుడ్డిగా నమ్మే మతిలేని ప్రజలు .. బాబా, బ్రాహ్మణ, పాస్టర్, ముల్లా ఏది తినమంటే అది తినే రకాల మనుషులు ఉన్నంత కాలం సమాజం లో శాంతి ఉండదు. మనిషి ఆలోచన కోల్పోయి స్వతహాగా ఆలోచించే శక్తీ ని పక్కన పెట్టేసి మాయల్లో బ్రతకాలనుకున్నప్పుడు ఇక జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది మనిషికి.
సైన్సు అనేది జీవన విధానం , సైన్సు ఆధారంగా ప్రతీదీ నిర్మిత మయినదే, ఈ విశ్వం లో మనకి తెలిసిన విషయాలు చాల తక్కివ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి... ఈ సృష్టిలో భూమ్మీద మనిషి ఆవిర్బవించి కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్న ఇప్పటికి కంటికి కనపడలేదు దేవుడు ఇక మరెప్పుడు కనపడతాడు, ? అదేంటని అడిగతే స్వర్గం లో ఉన్నాడంటారు , నరకం అంటారు, స్వర్గమేంటి నరకమేంటి ? అవి ఎక్కడున్నాయి ? ఎంత అర్ధరహితం ఈ వాదనలు ? ఈ జన్మలో నాకు తెలియని స్వర్గం నేను చచ్చిన తర్వాత ఉంటే ఎంత లేకుంటే ఎంత ? ఎవరికీ కావాలి స్వర్గం దీనికి శాస్త్రీయ నిరూపణ ఏమైనా ఉందా ?? అస్సలు అలాంటి మాటలు చెప్పే వారిని ఎంత వరకు నమ్మాలి ?
ప్రియ సోదరి సోదరులార ? ఇక నైన ఈ పిచ్చి మాయలలో నుంచి బయటకి రండి. మీరు బయపడాల్సింది దేవుడికి కాదు అణుబాంబు కి దానిని సృష్టించిన సైన్సు కి. మతం మాయాలు చేస్తుంది , వొంటికి గాయాలు చేస్తుంది, ప్రాణాలు తీస్తుంది... కాని సైన్సు అదే మనిషికి ప్రాణాలు పోస్తుంది....!
అస్సలు దేవుడున్నాడా ? ఎలా ఉన్నాడు ? ఎక్కడున్నాడు ? అనే ఒక ఆలోచన మీలో కలిగిందంటే అదే ఒక పెద్ద జ్ఞానం నాకు తెలిసి .. మిత్రులారా ఇక నైన నిజాలు తెలుసుకోండి సత్య అన్వేషణలో ముందుకు వెళ్ళండి.
మనిషికి కావాల్సింది మతం కాదు మంచి తనం .. మానవత్వం మనిషిని మనిషిగా చూసే ఒక నిండైన జ్ఞానం... పక్క వ్యక్తిని ప్రేమించటమే బక్తి , పక్క వ్యక్తి కష్టాలను పంచుకోవటమే దైవం.
నేను నిజ మార్గంలో సత్యంలో వాస్తవాలు వైపు ప్రయానిస్తున్నాను.. మీరు అదే బాటలో ప్రయణిస్తారని... ఆశిస్తూ .. హ్యూమనిస్ట్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి