23, అక్టోబర్ 2017, సోమవారం

రాజ్యాంగ విలువలను రక్షించుకుందాం.

1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది
లౌకిక భార‌తావ‌నిగా, స‌మైక్యంగా, క‌లిసి క‌ట్టుగా జీవించాల‌ని నిర్ణ‌యించుకున్నాం క‌దా!
1947కు ముందున్న గుళ్ళు, గోపురాలు, మ‌సీదులు, చ‌ర్చిల‌పై వివాదాలేందుకు?
ఇప్పుడు చ‌రిత్ర‌ను తిర‌గ‌దోడాల‌నే నిర్ణ‌యం వ‌ల‌న ప్ర‌యోజ‌నం పొందేదెవ‌రు?
మ‌త‌త‌త్వ భావాల‌ను ప్రేరేపించి, అధికారాన్ని పొందాల‌ని లేదా కాపాడుకోవాల‌ని కుట్ర‌లు ఎవ‌రికోసం?
1947 త‌రువాత జ‌రిగిన దేశ విభ‌జ‌న సంద‌ర్భంగానూ, అనంత‌రం నేటి వ‌ర‌కూ జ‌రిగిన మ‌త‌క‌ల‌హాల మార‌ణ‌కాండాల్లో 12 ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లిగొన్నారు.
ఇంకెంద‌రిని బ‌లిగొంటారు ఈ మ‌తోన్మాదులు?
మ‌తం వ్య‌క్తిగ‌తం.
మ‌తం రాజ్యాంగ యంత్రంలో జోక్యం చేసుకోరాదు.
రాజ్యాంగ యంత్రం మ‌తాన్ని ప్రోత్స‌హించ‌రాదు.
కాని నేడు జ‌రుగుతున్న‌ది దీనికి పూర్తి విరుద్ధం.
హిట్ల‌ర్ వార‌సులు నేడు చెల‌రేగిపోతున్నారు.
 పుకార్లు , వివాదాలు, భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నారు.
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు.
నాడు అయోధ్య‌.. నేడు తాజ్‌మ‌హ‌ల్‌..
అనంత‌రం కాశీ, మ‌ధుర‌, వార‌ణాసి
వీరి అమ్ముల‌పొదిలోని అస్ర్తాలు.
ఇంత‌టితో ఆగ‌రు ఈ మ‌తోన్మాదులు
ఇప్ప‌టికైనా ప్ర‌జాస్వామిక వాదులారా, లౌకిక‌వాదులారా, స‌మైక్య‌వాదులారా, మ‌న‌వ‌తావాదులారా, మౌనం వీడండి. రాజ్యాంగ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకుందాం.. స‌మైక్య, సెక్యుల‌ర్ భార‌తాన్ని కాపాడుకుందాం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి