27, అక్టోబర్ 2017, శుక్రవారం

బీజేపీ, BC ల అభివృద్ధికి వ్యతిరేకం.

*బీజేపీ చరిత్ర బీసీల అభివృధ్ధికి వ్యతిరేకం.*
-----------------------------------------------------

1.        బీసీల రిజర్వేషన్ల విషయంలో గాని, వారి అభివృధ్ధికి సంబంధించిన విషయాల్లో గాని, బీజెపీ, వారి సాంస్క్రుతిక విభాగాలైన RS లాంటి వివిధ పరివార సంస్థల వైఖరి, మొదటి నుండీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన చరిత్రే. బీసీలకు అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర ఏనాడూ వారికి లేదు. మొన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లకు ముందు, RSS అధినేత శ్రీ మోహన్ భగత్, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయించే లక్ష్యంతో, వారి రిజర్వేషన్లను సమీక్షించాలని ఆయన చేసిన బహిరంగ ప్రకటన, వారి తత్వానికి అద్దం పట్టే మంచి ఉదాహరణ.

2.         వాస్తవాల్ని వక్రీకరిస్తూ, అసత్యాల్ని సత్యాలుగా, సత్యాల్ని అసత్యాలుగా ప్రచారం చేసి భ్రమింప చేయడంలో వీరు సిధ్ధహస్తులు. "దేశభక్తి", "సాంప్రదాయం" లాంటి అనేక ఆకర్షణీయ నినాదాలతో అమాయక బీసీ జనాల్ని తమకు అనుకూలంగా ఆకట్టుకొని  నియంత్రించు కోవడంలో వీరు సిధ్ధహస్తులు.

3.         మండల్ కమిషను నివేదిక సందర్భంలోను, దాన్ని పాక్షికంగా అమలు చేయ ప్రయత్నించిన సందర్భంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన శక్తుల్లో వీరే అగ్రగణ్యులు. బీసీలకు ఉద్యోగ రంగంలో 27% రిజర్వేషన్లు కల్పించిన పాపానికి వీ.పీ.సింగుగారిని పదవినుంచి దించిన ఘనత ఈశక్తులదే. ఇటువంటి, వీరి బీసీ వ్యతిరేక ఘట్టాలు చరిత్రనిండా కోకొల్లలు. ఇపుడు బీసీల్ని ఉధ్ధరించడమే తమ ఆశయమని నమ్మబలకడానికి రకరకాలుగా బీసీల్ని ఆకర్షించి లబ్ది పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో "జాతీయ బీసీకమిషనుకు" రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం. దీన్ని అడ్డం పెట్టుకొని బీసీల ఓట్లకు ఇంకా విస్త్రుత స్థాయిలో గాలం వేయబోతున్నారు. బీసీలు మోసపోవద్దు.

4.         ప్రభుత్వ యంత్రాంగాన్ని బ్రాహ్మణ శక్తులకు, దేశ ఆర్ధిక వ్యవస్థను బనియాలకు, రాజకీయ వ్యవస్థను ద్విజ త్రయానికి కట్టబెట్టడానికి, వారి ఆధిపత్యాన్ని కొనసాగించ డానికి, రకరకాల ఎత్తుగడలతో, నిత్యం శ్రమించే ఈశక్తులకు, బీసీలు ఓటుబ్యాంకుగాను, వారిపల్లకీలు మోసే బోయీలుగాను, వారి ఆధిపత్యాన్ని రక్షించే రక్షక భటులుగాను మిగిలి పోవడం అంటే మనగోతిని మనం తవ్వుకోవడమే.

5.         అందుచేత బీసీలు బీజేపినీ, పరివార శక్తులను దూరంగా పెట్టాలి. దానికి ప్రత్యమ్నాయంగా సొంత రాజకీయ వేదికను బీసీలు నిర్మాణం చేసుకోవాలి. *బీసీ గౄపుల్లో బీజేపీ రాజకీయ ప్రచారాన్ని నియంత్రించాలి.*

                  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి