23, డిసెంబర్ 2017, శనివారం

మనుధర్మశాస్త్రం అసలేం చెప్పింది?

మనుధర్మశాస్త్రం అసలేం చెప్పింది?

అని పరిశీలిస్తే..
భారతదేశ సమస్త వెనుకబాటుతనానికి కారణమైన కులవ్యవస్థను కట్టుదిట్టం చేసి, కులధర్మమే హిందూ ధర్మంగా ప్రచారం చేసింది మనుధర్మం. కుల ధర్మాన్ని పాటించనివారికి కఠోరమైన శిక్షలు విధించి అసమానతలను పెంచి పోషించి సామాజిక చట్టంగా చెలామణి అయ్యింది మనుధర్మశాస్త్రం. ఒకరకంగా చెప్పాలంటే 1950 వరకు అధికారికంగా, ఆ తర్వాత రాజ్యాంగం అమలైనప్పటికీ, అనధికారికంగా సమాజంలో అమలవుతున్నది
మనుధర్మ శాస్త్రమే. దేశంలోని పాలన, సంపద, వాణిజ్య వ్యాపారాలు, సంస్థలు పరిశ్రమలు నేటికీ బ్రాహ్మణ, బనియా (వైశ్య) కులాల గుత్తాధిపత్యంగా ఉండడమే ఇందుకు ఉదాహరణ.
స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏళ్లలో 14 మంది ప్రధానులు అగ్రకులానికి చెందినవారు కావడాన్ని ఎలా భావించాలి?

శూద్రులంటే ఎవరు?
శూద్రులంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాని మిలిన చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు. అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు. వీరు ద్విజులు కాదు.
'" బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదాలనుండి శూద్రులు పుట్టారు." అని ( ఋగ్వేదం 10 - 90 - 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.
" భగవద్గీత " 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.
మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది. సాక్షాత్తు శ్రికృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 - 1 ) లో పేర్కొన్నాడు.
బ్రాహ్మణ మత సామాజిక వ్యవస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?
1. " బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )
2. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )
3. " ,బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )
4. " బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )
5. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )
6. " బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )
7. " శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )
8. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )
9. " బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )
10. "శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి " ( మను 8 - 282)
11. " బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )
12. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )
13. " బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )
14. " బ్రాహ్మణున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. "
( మను 9 - 335 )
ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించింన మనుధర్మశాస్త్రం. శూద్ర, అతిశూద్ర కులాను అంటరానివారుగా బానిసలుగా చిత్రీకరించింది.
శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్ధారించింది. ఈ శ్లోకాన్ని చూడండి!

‘స్వర్గార్థ ముఖయార్థం వా విప్రానారాధయేత్తు పః జాత బ్రాహ్మణశబ్దస్య సా హ్యస్య కృతకృత్యతా॥

బహుజనులు, పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలెంచక శుశ్రూష చేసి జీవనం సాగించాలనే నియమాన్ని విధించింది.

‘ఏకమేవతు శూద్రస్య ప్రభు: కర్మ సమాదిత్‌ ఏతేషామేవ వర్ణానాం శశ్రూషా మనసూయయా॥

శూద్రులు, అతిశూద్రులు ఎప్పటికీ వెట్టిచాకిరి చేసే వారిగానే ఉండాలి తప్ప, విద్య (నశూద్రాయా మతిందద్యాత్), జ్ఞానం, డబ్బు సంపాదించరాదు

శక్తేనా పిహి శూద్రేణ న కార్యో ధన సంచయ: శూద్రోహి ధన మాసాద్య బ్రాహ్మణానేవ బాధతే॥

ఒకవేళ ఈ నియమాన్ని
పాటి స్తే వారి చెవుల్లో సీసం పోసి, నాలుకలు తెగకోయాలని (జిహ్వాయా వూపాప్నుయాచ్ఛే దం) నిబద్ధించింది. కేవలం శూద్రులనే కాక స్త్రీలను కూడా కడు హీనంగా, స్వాతంత్ర్య హీనులుగా, అబలలుగా, పురుషుడికి భగవంతుడు ప్రసాదించిన అందమైన వస్తువులుగా, తమ సేవకులుగా ఉండి తరించాలని,వెట్టిచాకిరిని సామాజిక నిష్టం చేసి పూర్తిస్థాయిలో స్త్రీలనుఅణచివేసిందీ ఈ మనుస్మృతి గ్రంథంమే.మనుధర్మశాస్త్రం మనుషులను విడదీసి నిచ్చెనమెట్ల అసమాన కులవ్యవస్థ ద్వారా దళితులను పశువుల కంటే హీనంగా చేసింది. మెజారిటీ ప్రజలైన బహుజనుల వెనుకబాటుతనానికి నూటికినూరు శాతం కారణమైంది. అందుకే బహుజన పితామహులైన ఫూలే మొదలుకొని కాన్షీరాం వరకు మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని పట్టుబట్టడానికి కారణంగా ద్యోతకమవుతున్నది.
Dr.B.R. అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 న మనుధర్మ శాస్త్ర ప్రతిని తగులబెట్టారు. స్వేచ్ఛను హరించి, అసమానత్వాన్ని పెంచి పోషించి, సౌభ్రాతృత్వాన్ని హత్యచేసి అమానుషమైన కులదొంతర సమాజానికి మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టడంనేటికీ సమంజసమేననిపిస్తున్నది. ఈ కుల నిర్మూలన జరగనంతకాలం ‘మనుస్మృతి దహన దినం’ పాటించవలసే ఉంటుంది.

మతంతో పేరు శూద్రులపై జరిపిన ఈ మనుధర్మం అనే ధర్మం న్యాయమైనదేనా?
అలా శాసించి అమలుపరచిన మతం పవిత్రమైనదిగా భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణిించాలా ?

28, అక్టోబర్ 2017, శనివారం

బహుజనం బయలుదేరింది

*బహుజనం బయలుదేరింది!*


మా తాతలను కుట్రలు, కుయుక్తుల తొ యుద్ధ నీతి మరిచి దొంగదెబ్బలు తీసి రాజ్యాలు గుంజుకుని మీ వశం చేసుకుని మమ్మల్ని బానిసలుగ  చేసుకుని తరతరాలుగా మాచేత సర్వ చాకిరీలు చేయించుకుంటున్నా... మౌనంగా భరిస్తు, ధర్మంగా జయించాలనె న్యాయ పోరాటాలు చేస్తున్నాం కాని మీలా నీతి తప్పిన చేతలు, మతితప్పిన మాటలు మా తాతలు బుద్దుడు, అశోకుడు మెదలుకొని పూలె,అంబేద్కర్ నుండి నేటికి మా జాతి చేయలేదు, మాట్లాడలేదు!

మేము పాదాల్లొ పుట్టినమని, శూద్ర జాతి వాల్లమని, అనగారిన వాల్లమని, అంటరాని వాల్లమని. వేల ఏళ్ళ వెలివేతలు, ఎన్నో అవమానాలు చేసిన, ఎన్నో అనిచివేత రాతలు మీరు రాసిన, మరెన్నో అభూత కల్పనలు చేసిన! జ్ఞానం తొ ఎదిరించామె గాని.. మీలా బొమ్మలపై ఉచ్చ పోసుడు, మనుషులకె పుట్టనట్టు భూతులు తిట్టుడు, చిత్రపటాలను కాళ్ళ గంతల్లా వేసి కాళ్ళతొ తొక్కుడు లాంటి అ మానవీయ చర్యలేవి మేం చేయలె..!

 నువ్వు ఏ భావాన్ని ప్రకంటించిన ఆ భావాన్ని మా భావ ప్రకటన స్వేచ్ఛతోనె ఎదురుకున్నాము గాని, నీలా  నరుకుతా, చంపుతా,పొడుస్తా అంటు రాక్షసత్వాన్ని ఏనాడు ప్రదర్శించలె నువ్వు ప్రకటిస్తే బెదరలె ఎందుకంటే తర తరాలుగా యుగ యుగాలగా ఆదే నీ తత్వం, నాటి నుంచి నేటిదాక నా జాతి మీద నీదెపుడూ అరాచక వాదమె! అధర్మ యుద్ధమె..!!

నా తాత అంబేద్కర్ విగ్రహానికి కూడా చెప్పుల దండలేసి రాక్షసానందాన్ని పొందుతావు నీవు, కానీ నేను నీలా గాంధితాతకు ఎప్పుడైనా వేశాన......?

నువ్వు ఏ విద్యను నాకు ధూరం చేశావొ ఆ విద్యతోనె నీ మనవాదపు మిద్దెలు కూలదోస్తున్నాను!

నువ్వు ఏ చరిత్రనైతె వక్రీకరించావొ నేను ఆ చరిత్రనె సక్రీకరిస్తున్నాను!

నువ్వు ఏ సత్యాన్ని సమాధి చేశావొ నేను ఆ సత్యాన్నె తవ్వి తీస్తున్నాను!

నువ్వు ఏ సంస్కృతినైతే నాశనం చేశావొ నేను ఆ సాంస్కృతిక పోరాటాన్ని లేపాను!

ఇప్పుడు చెప్పు...

నీవు ఉన్నతుడివా,
నేను ఉన్నతుడినా?

నీవు రాక్షసుడివా,
నేను రాక్షసుడినా?

సాటి మనిషిని మనిషిగా కాకుండా కులాలుగ, మతాలుగ విడగొట్టి. హెచ్చు తగ్గుల, అంటు ముట్ల వాల్లను చేసిన నువ్వు మనిషివా?

నువ్వూ, నేను మనుషులమె సమానంగా వుందాం, సౌబ్రాతృత్వంతొ బ్రతుకుదాం అనె నేను మనిషినా?

నేను బయలు దేరాను..
నా వాటా కోసం వేట మెదలు పెట్టాను..
జ్ఞాన సమాజాన్ని తయారు చేస్తున్నాను!

నువ్వు జ్ఞానవంతుడవై ఉండు.
అంతె కాని అజ్ఞానంతొ అడ్డుకోవాలని చూడకు అడుగుల మధ్య పడి నలిగిపోతావు.

27, అక్టోబర్ 2017, శుక్రవారం

బీజేపీ, BC ల అభివృద్ధికి వ్యతిరేకం.

*బీజేపీ చరిత్ర బీసీల అభివృధ్ధికి వ్యతిరేకం.*
-----------------------------------------------------

1.        బీసీల రిజర్వేషన్ల విషయంలో గాని, వారి అభివృధ్ధికి సంబంధించిన విషయాల్లో గాని, బీజెపీ, వారి సాంస్క్రుతిక విభాగాలైన RS లాంటి వివిధ పరివార సంస్థల వైఖరి, మొదటి నుండీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించిన చరిత్రే. బీసీలకు అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర ఏనాడూ వారికి లేదు. మొన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లకు ముందు, RSS అధినేత శ్రీ మోహన్ భగత్, బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయించే లక్ష్యంతో, వారి రిజర్వేషన్లను సమీక్షించాలని ఆయన చేసిన బహిరంగ ప్రకటన, వారి తత్వానికి అద్దం పట్టే మంచి ఉదాహరణ.

2.         వాస్తవాల్ని వక్రీకరిస్తూ, అసత్యాల్ని సత్యాలుగా, సత్యాల్ని అసత్యాలుగా ప్రచారం చేసి భ్రమింప చేయడంలో వీరు సిధ్ధహస్తులు. "దేశభక్తి", "సాంప్రదాయం" లాంటి అనేక ఆకర్షణీయ నినాదాలతో అమాయక బీసీ జనాల్ని తమకు అనుకూలంగా ఆకట్టుకొని  నియంత్రించు కోవడంలో వీరు సిధ్ధహస్తులు.

3.         మండల్ కమిషను నివేదిక సందర్భంలోను, దాన్ని పాక్షికంగా అమలు చేయ ప్రయత్నించిన సందర్భంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన శక్తుల్లో వీరే అగ్రగణ్యులు. బీసీలకు ఉద్యోగ రంగంలో 27% రిజర్వేషన్లు కల్పించిన పాపానికి వీ.పీ.సింగుగారిని పదవినుంచి దించిన ఘనత ఈశక్తులదే. ఇటువంటి, వీరి బీసీ వ్యతిరేక ఘట్టాలు చరిత్రనిండా కోకొల్లలు. ఇపుడు బీసీల్ని ఉధ్ధరించడమే తమ ఆశయమని నమ్మబలకడానికి రకరకాలుగా బీసీల్ని ఆకర్షించి లబ్ది పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో "జాతీయ బీసీకమిషనుకు" రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం. దీన్ని అడ్డం పెట్టుకొని బీసీల ఓట్లకు ఇంకా విస్త్రుత స్థాయిలో గాలం వేయబోతున్నారు. బీసీలు మోసపోవద్దు.

4.         ప్రభుత్వ యంత్రాంగాన్ని బ్రాహ్మణ శక్తులకు, దేశ ఆర్ధిక వ్యవస్థను బనియాలకు, రాజకీయ వ్యవస్థను ద్విజ త్రయానికి కట్టబెట్టడానికి, వారి ఆధిపత్యాన్ని కొనసాగించ డానికి, రకరకాల ఎత్తుగడలతో, నిత్యం శ్రమించే ఈశక్తులకు, బీసీలు ఓటుబ్యాంకుగాను, వారిపల్లకీలు మోసే బోయీలుగాను, వారి ఆధిపత్యాన్ని రక్షించే రక్షక భటులుగాను మిగిలి పోవడం అంటే మనగోతిని మనం తవ్వుకోవడమే.

5.         అందుచేత బీసీలు బీజేపినీ, పరివార శక్తులను దూరంగా పెట్టాలి. దానికి ప్రత్యమ్నాయంగా సొంత రాజకీయ వేదికను బీసీలు నిర్మాణం చేసుకోవాలి. *బీసీ గౄపుల్లో బీజేపీ రాజకీయ ప్రచారాన్ని నియంత్రించాలి.*

                  

24, అక్టోబర్ 2017, మంగళవారం

అంబేద్కర్ ఆశించిందేమిటి?

అంబేద్కర్ ఆశించింది ఏమిటి?
అయన సాధించిన ఫలాలని మనం నిలబెట్టుకోగలిగామా?

తన జీవితములో అంబేడ్కర్ అనేక సభలు సమావేశాలలో సందేశాలు ఇచ్చినా, తన జీవిత చరమాంకములో అనగా 18 మార్చ్ 1956 న ఆగ్రా లో ఇచ్చిన సందేశాన్ని చారిత్రాత్మక సందేశముగా చెపుతూ ఉంటారు.
ఆ సందేశములో,  దళిత బహుజన ప్రజలకు, యువతకు, భూములు లేని శ్రామికులకు,రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారికి,  విద్యార్ధులకు, వివిధ సంఘాల నాయకులకు, విడివిడిగా సందేశమిచ్చారు.
అందులో, ప్రాముఖ్యముగా., రిజర్వేషన్ లతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారిని ఉద్దేశించి ఈ క్రింది మాటలు చెప్పారు.
“Our society has progressed a little bit with education. Some persons have reached high posts after getting education. But these educated persons have betrayed me. I expected that they would do social service after getting higher education. But what I see is a crowd of small and big clerks who are busy in filling their own bellies. Those who are in government service have a duty to donate 1/ 20th part of their pay for social work. Only then the society will progress otherwise only one family will be benefitted. An educated social worker can prove to be a boon for them.”
ఈ మాటలు చెప్పినది 1956 లో.,  అంటే.., షుమారు 61 సంవత్సరాలు దాటిపోయింది.
ఆంబేడ్కర్ గారు ఆనాడు అన్న ఆ మాటలు నేటి తరములో ఉన్న మనకు ఎంతవరకు applicable అని ఇప్పుడు మనం అర్ధం చేసుకోవాలి.
ఆనాటి కాలములో ఉన్న మొత్తము ప్రభుత్వ ఉద్యోగాలు, నేటి సంఖ్య తో పోల్చుకుంటే చాలా తక్కువ, అప్పటికి ఇంకా ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్, బి.సి.లకు, మహిళలకు రిజర్వేషన్స్ వంటివి ఇంకా పఠిష్టం గా అమలు కాని రోజులు. అంటే, అంబేడ్కర్ గారి ఈ మాటలు అనాటి తరానికంటే నేటి తరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు  more applicable అనమాట.

అవును, అంబేడ్కర్ గారు  అన్న ఆ మాటలు లోతుగా ఆలోచించాలి., అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించాలి.
ఆ మాటలు అర్ధమవ్వాలి అంటే.,
(1) తరతరాలుగా ఉన్న తాత ముత్తాత ల చరిత్ర అర్ధమవ్వాలి.
(2) తాత ల చరిత్ర వేరు, నేను వేరు అనే ధోరణి ఉండకూడదు.
(3) ఈ దేశములో నివసిస్తున్న ప్రతి దళితుడు, మూడు తరములు వెనక్కి వెళ్ళి అప్పుడున్న ముత్తాత, అంతకుముందున్న తరముల పితృ సమానులైన వారంతా, అంటరానివారిగా జీవించి, ఎవరూ చేయలేని కులవృత్తులైన పాకిపని,పెంటపని చేసినవారనే విషయము తెలుసుకోవాలి.
(4) ఇరవయ్యొవ శతాబ్దములో., డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు పుట్టకుండా ఉంటే., మనమంతా, ఇంకా అదే కుల వృత్తులలో కొనసాగేవారమని గుర్తించాలి.
ఈ నాలుగు విషయాలు గురించి నాలుగు నిమిషాలు ఆలోచిస్తే., ఆయన చెప్పిన  payback  1/20 part యేంటి, ½ part  అయినా సమజానికి వెచ్చించాలని అనిపిస్తుంది.

అంబేడ్కర్ వ్రాసిన మరికొన్ని books చదివితే మరొక విషయము అర్ధం అవుతుంది. అదేమిటంటే..,ఆయన చెప్పిన  payback  కేవలము డబ్బును  donate చెయ్యడము గురించి కాదు. ఆయన payback  చెయ్యమని చెప్పినది మూడు వస్తువులను., అవి.,
(1) Treasure
(2) Time
(3) Talent
[All these three terms starts with ”T”]
వివరణలు:
(1) TREASURE  : నీ జీతము [Gross salary] నెలసరి రూ.30000/- అయితే షుమారు రూ.1500/- మన దళిత సమాజం కోసం ఖర్చు పెట్టాలి. ఆ రకముగా., మన  Car Loan, Home Loan లకోసం కట్టే  EMI  లను సర్దుబాటు చేసుకోవాలి.దీనర్ధం, SC.ST  సంఘాలకు  donations ఇవ్వాలనికాదు. ఈ క్రింద చెప్పిన విధముగా కూడా చెయ్యవచ్చును
(A) మీ సమీప గ్రామాలలో తినడానికి తిండి లేని దళిత కుటుంబాలలో పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, సైకిల్  కొనిస్తే చాలు.
(B) సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న విద్యార్ధులకు స్కూల్ లేదా కాలేజ్ యూనిఫాం  కొనిస్తే చాలు.
(C) మన బంధువులలోనే ఉన్న కడుపేద కుటుంబాలకు నేలకు ఈ రూ.1500/-  donate  చేస్తే చాలు.
(2)  TIME  : ఇది చాలా విలువైనది. మన సమయాన్ని, నెలకు ఒక రోజు మన సమాజములో గడపాలి. SC/ST Associations వారు పెట్టేసభలు సమావేశాలకు హాజరవ్వాలి. అది తరువాత తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మన  “Target group”  అనేది “దళిత విద్యార్ధులు” అవ్వాలి.  TIME అనే విషయములో మనందరికంటే ఎంతో ధనవంతులు. వారి జీవితాలు చాలా పెద్దవి.
(3)  TALENT  : “నేలకు గట్టిగా అణిచివేయబడిన బంతి ఎక్కువ ఎత్తు ఎగురుతుంది”  అనే సూక్తి, నేటి దళితులకు talent ఎక్కువ అని చెపుతుంది. వీరికి సహజంగానే క్రమశిక్షణ, పెద్దలంటే భయము, శ్రమ చెయ్యగల దేహ ధారుడ్యం ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే మించి, "మనుగడ కోసం పోరాటం" అనే అవసరం.   వీటి వలన  talent  అనేది కూడా బాగనే ఉంటుంది. ఈ  talent ను కూడా మన సమాజానికి పంచి ఇస్తే, మన యొక్క ఆ  talent పెరగడమే కాకుండా., మన సమాజం కూడా వృధి చెందుతుంది.

ఈ  Treasure,Time,Talent లను మన సమాజమునకు  5% పంచి ఇస్తే., ఆంబేడ్కర్ కలలు కన్న కులరహిత సమాజం ఎంతో దూరాన ఉండదు.

దయచేసి గమనించండి: నా ఈ పోస్ట్, ఈ మాటలు చదువుతున్న వారిని ఉద్దేశించి కాదు. ఈ పోస్ట్ చదివారు అంటే., మీరు ఇప్పటికే అంబేడ్కర్ చెప్పిన దారిలోనే ఉన్నారని అర్ధము. ఎందుకంటే., ఈ పోస్ట్ చదివి ఇప్పటికే అన్నిటికంటే అమూల్యమైన మీ సమయాన్ని payback చేశారని అర్ధం. నేనైతే, రోజుకొక్క సారైనా, మా అమ్మయి తో, నా వైఫ్ తో కలిసి అంబేడ్కరిజం గురించి చర్చించుకుంటాము.  కాని రిజర్వేషన్ లో ప్రభుత్వ ఉద్యోగం పొంది., అంబేడ్కర్ అంటే ఎవరో తెలియని మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పోస్ట్ చేరాలి.
అందుకె నా ఈ ప్రయత్నం.

మనిషి పిచ్చి

మనిషి పిచ్చికి అంతే లేదు.....

నమ్మకం మంచిదే కాని... నువ్వు నమ్మిన ఆ నమ్మకమే నిన్ను సర్వ నాశనం చేస్తున్నప్పుడు ఇంకా దానినే పట్టుకు వేలాడుతా అనుకోవటం ఒక అతి మూర్కత్వం ..

సమాజం లో చదువు రాని మూర్కుల కన్నా చదువుకున్న మూర్కుల వల్లే చాల ప్రమాదం. వాడు చదవక ఉపయోగం లేదు వీడు చదివి ఉపయోగం లేదు. దేవుడే లేకపోతె ఈ సృష్టి ఎలా జరిగింది ? ఈ జంతుజాలం ఎలా పుట్టింది ? ఇవి తరచుగా వినిపించే ఎదవ ప్రశ్నలు... వీటికి ఎవరికీ ఆధారాలతో కూడిన సమాధానాలు లేవుగాని ఒక్కటి నిజం... అదే మన మూర్కత్వం , మన మూర్కత్వం వల్లే జరగనివి సాధ్యం కానివి , అంతు చిక్కనివి జరుగుతాయని నమ్మటం ఎదో ఒక పిచ్చిలో బ్రతికేయటం.

దేవుణ్ణి సృష్టించింది మనిషే ఇది నిజం , దేవుని చేతికి మాయలు మంత్రాలు ఇచ్చింది మనిషే, మనకి ప్రాచుర్యం లో ఉన్న అన్ని మత గ్రంధాలు , దేవుని ఉనికిని ప్రస్తావించే అన్ని పుస్తకాలు, కథలు , మనిషి చేత రాసినవే. ఆ రాసిన మనిషి రాసిన కారణం , దాని ఫలితం మనకి తెలియదు గాని అప్పటి పరిస్థితుల్లో వారి బతుకుదెరువు కోసం అయి ఉండొచ్చు గాని.. ఈ నవీన సమాజం లో దేవుడు దెయ్యాలు ఒక అనాగరిక చర్యలు. మూర్కత్వపు పోకడలు, ఆలోచించలేని అజ్ఞానము. కాలయాపన , సోమరితనం , మన కష్టాల్ని ఇంకొకరి మీద వేసేసి చేతులు దులిపెసుకోవాలనుకోవటం ఇది తప్పించి దేవుని వల్ల మానవాళికి కలిగే ఒక్క ఉపయోగం కూడా శాస్త్రీయంగా ఇప్పటికి ఎవరు నిరుపించలేక పోయారు. ఇక నిరుపించలేరు కూడా....

దేవుని మాయలో పెట్టుబడిదారులు ప్రజల్ని చేసే మోసాలు అన్ని ఇన్ని కాదు, వాటిని ఒక్కొకటి చెప్పుకుంటూ పోతే facebook లో పేజీలు చాలవు... మన జీవితం సరిపోదు. దేవుడు లేకుండా మతం మనుగడ సాదించలేదు, మతం అంటే ఒక మూర్కత్వం, మతాలు పోటీ పడటం ఎలాగో తెలుసా ? మా మూర్కత్వం గొప్పది అంటే మా మూర్కతం గొప్పది అని. ఈ పిచ్చి ఇప్పుడు పరాకాష్టకి చేరి ఎవరినైతే వుద్దరించాటానికి మతం పుట్టిందో వారిని సమూలంగా సర్వనాశనం చేయడం మొదలయ్యింది. దేవుడి కోసం అమూల్యమయిన అత్యంత విలువయిన ఈ మనిషి పుట్టుకను నిలువునా చంపేసుకోవడం మూర్కత్వం లో మొదటి మూర్కత్వం...

మతాల పేరిట జరిగే మారనకాండలు , మతాల పేరిట జరిగే దారుణాలు వాటిని గుడ్డిగా నమ్మే మతిలేని ప్రజలు .. బాబా, బ్రాహ్మణ, పాస్టర్, ముల్లా ఏది తినమంటే అది తినే రకాల మనుషులు ఉన్నంత కాలం సమాజం లో శాంతి ఉండదు. మనిషి ఆలోచన కోల్పోయి స్వతహాగా ఆలోచించే శక్తీ ని పక్కన పెట్టేసి మాయల్లో బ్రతకాలనుకున్నప్పుడు ఇక జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది మనిషికి.

సైన్సు అనేది జీవన విధానం , సైన్సు ఆధారంగా ప్రతీదీ నిర్మిత మయినదే, ఈ విశ్వం లో మనకి తెలిసిన విషయాలు చాల తక్కివ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి... ఈ సృష్టిలో భూమ్మీద మనిషి ఆవిర్బవించి కొన్ని వేల సంవత్సరాలు జరుగుతున్న ఇప్పటికి కంటికి కనపడలేదు దేవుడు ఇక మరెప్పుడు కనపడతాడు, ?  అదేంటని అడిగతే స్వర్గం లో ఉన్నాడంటారు , నరకం అంటారు, స్వర్గమేంటి నరకమేంటి ? అవి ఎక్కడున్నాయి ? ఎంత అర్ధరహితం ఈ వాదనలు ? ఈ జన్మలో నాకు తెలియని స్వర్గం నేను చచ్చిన తర్వాత ఉంటే ఎంత లేకుంటే ఎంత ?  ఎవరికీ కావాలి స్వర్గం దీనికి శాస్త్రీయ నిరూపణ ఏమైనా ఉందా ?? అస్సలు అలాంటి మాటలు చెప్పే వారిని ఎంత వరకు నమ్మాలి ?

ప్రియ సోదరి సోదరులార ? ఇక నైన ఈ పిచ్చి మాయలలో నుంచి బయటకి రండి. మీరు బయపడాల్సింది దేవుడికి కాదు అణుబాంబు కి దానిని సృష్టించిన సైన్సు కి. మతం మాయాలు చేస్తుంది , వొంటికి గాయాలు చేస్తుంది, ప్రాణాలు తీస్తుంది... కాని సైన్సు అదే మనిషికి ప్రాణాలు పోస్తుంది....!
 అస్సలు దేవుడున్నాడా ? ఎలా ఉన్నాడు ? ఎక్కడున్నాడు ? అనే ఒక ఆలోచన మీలో కలిగిందంటే అదే ఒక పెద్ద జ్ఞానం నాకు తెలిసి .. మిత్రులారా ఇక నైన నిజాలు తెలుసుకోండి సత్య అన్వేషణలో ముందుకు వెళ్ళండి.

మనిషికి కావాల్సింది మతం కాదు మంచి తనం .. మానవత్వం మనిషిని మనిషిగా చూసే ఒక నిండైన జ్ఞానం... పక్క వ్యక్తిని ప్రేమించటమే బక్తి , పక్క వ్యక్తి కష్టాలను పంచుకోవటమే దైవం.

నేను నిజ మార్గంలో సత్యంలో వాస్తవాలు వైపు ప్రయానిస్తున్నాను.. మీరు అదే బాటలో ప్రయణిస్తారని... ఆశిస్తూ .. హ్యూమనిస్ట్ 

23, అక్టోబర్ 2017, సోమవారం

రాజ్యాంగ విలువలను రక్షించుకుందాం.

1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించింది
లౌకిక భార‌తావ‌నిగా, స‌మైక్యంగా, క‌లిసి క‌ట్టుగా జీవించాల‌ని నిర్ణ‌యించుకున్నాం క‌దా!
1947కు ముందున్న గుళ్ళు, గోపురాలు, మ‌సీదులు, చ‌ర్చిల‌పై వివాదాలేందుకు?
ఇప్పుడు చ‌రిత్ర‌ను తిర‌గ‌దోడాల‌నే నిర్ణ‌యం వ‌ల‌న ప్ర‌యోజ‌నం పొందేదెవ‌రు?
మ‌త‌త‌త్వ భావాల‌ను ప్రేరేపించి, అధికారాన్ని పొందాల‌ని లేదా కాపాడుకోవాల‌ని కుట్ర‌లు ఎవ‌రికోసం?
1947 త‌రువాత జ‌రిగిన దేశ విభ‌జ‌న సంద‌ర్భంగానూ, అనంత‌రం నేటి వ‌ర‌కూ జ‌రిగిన మ‌త‌క‌ల‌హాల మార‌ణ‌కాండాల్లో 12 ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లిగొన్నారు.
ఇంకెంద‌రిని బ‌లిగొంటారు ఈ మ‌తోన్మాదులు?
మ‌తం వ్య‌క్తిగ‌తం.
మ‌తం రాజ్యాంగ యంత్రంలో జోక్యం చేసుకోరాదు.
రాజ్యాంగ యంత్రం మ‌తాన్ని ప్రోత్స‌హించ‌రాదు.
కాని నేడు జ‌రుగుతున్న‌ది దీనికి పూర్తి విరుద్ధం.
హిట్ల‌ర్ వార‌సులు నేడు చెల‌రేగిపోతున్నారు.
 పుకార్లు , వివాదాలు, భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నారు.
ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు.
నాడు అయోధ్య‌.. నేడు తాజ్‌మ‌హ‌ల్‌..
అనంత‌రం కాశీ, మ‌ధుర‌, వార‌ణాసి
వీరి అమ్ముల‌పొదిలోని అస్ర్తాలు.
ఇంత‌టితో ఆగ‌రు ఈ మ‌తోన్మాదులు
ఇప్ప‌టికైనా ప్ర‌జాస్వామిక వాదులారా, లౌకిక‌వాదులారా, స‌మైక్య‌వాదులారా, మ‌న‌వ‌తావాదులారా, మౌనం వీడండి. రాజ్యాంగ విలువ‌ల‌ను ప‌రిర‌క్షించుకుందాం.. స‌మైక్య, సెక్యుల‌ర్ భార‌తాన్ని కాపాడుకుందాం...

ములనివాసి చరిత్ర.

ఆధునిక భారతదేశంలో స్వతంత్ర్యం కొరకు రెండు ఉద్యమాలు జరిగాయి..

1) యురేషియన్‌ బ్రాహ్మణులు చేసిన స్వతంత్ర్య ఉద్యమం
గోపాలక్రిష్ణ గోఖలే, బాలగంగాదర్‌ తిలక్‌, గాందీ, నెహ్రు
నాయకత్వంలో ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి కలగడానికి జరిగింది., ఇది మొదటిది

2) రెండోవది మూలవాసి మహనీయుల స్వతంత్ర్య ఉద్యమం, ఇది యురేషియన్‌ బ్రాహ్మణుల బానిసత్వం నుండి విముక్తి కావడానికి జరిగిన ములనివాసి ఉద్యమం.
ఈ రెండోవా ఉద్యమం మహాత్మా జ్యోతిబా పూలే, సాహు మహారాజ్‌, బాబాసాహేబ్‌ అంబేద్కర్‌, పెరియార్‌ రామస్వామి నాయకత్వంలో జరిగింది..

ఇప్పుడు కేవలం యురేషియన్‌ బ్రాహ్మణుల ఉద్యమాన్ని మాత్రమే మనతో తప్పులతడకగా చదివిస్తున్నరు..

63 సంవత్సరాలుగా మనం ఈ మాటలు వింటున్నం, వినడమే కాదు అదే నిజమని నమ్ముతం.. ఇంత పెద్ద అబద్దపు చరిత్రను ప్రపంచంలో మరెవ్వరు చదివించలేదు..

...... జై మూల్నివాసి