తప్పులు చెప్తున్న పంచాంగం!
సూర్యుడు నిజంగా మకర రాశిలోకి వెళ్తాడా? వెళ్ళడు. సూర్యుడు ఒక రాశి లోకి వెళ్ళడం ఏమిటీ? ఏమైనా అర్థం ఉన్నదా?
నాయనా, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి మీద ఉన్నావు కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది అంతే! సూర్యుడికీ, నువ్వు రాశులు అంటున్న, నీవు ఊహిస్తున్న, ఆ దూరపు నక్షత్రాల సమూహాల షేపులకూ మధ్య ఎంత దూరం ఉందనుకుంటున్నావూ?
ప్రతి నెలా ఒక కొత్త రాశి లోకి పేరంటానికి వెళ్ళడం తప్ప మా సూర్యుడికి ఇంకేం పని లేదా? లేక బాన పొట్ట పెంచుకుని అర మీటరు గోళ్ళు పెంచుకుని వచ్చీ రాని అబద్ధపు లెక్కలు వేస్తున్న నీకు పని లేదా?
నువ్వు ఒక విషయం తప్పుగా అర్థం చేసుకుని దాని ఆధారంగా మా భవిష్యత్తూ, మార్కెట్ లో సినిమా కలెక్షన్ల సంగతీ, సినిమా స్టార్ల పెళ్ళిళ్ళు, వాళ్ళకు పుట్టబోయే పిల్లలూ, వాళ్ళ విడాకులూ, సమాజం యొక్క పరిస్తితీ, ఎలక్షన్ ఫలితాలూ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతావా? డబ్బులు తీసుకుని రెమెడీలు ఇస్తావా? ఓరి నీ బడాయీ!
సూర్యోదయం, సూర్యాస్తమయం, గ్రహాల కదలికా, గ్రహణాల సమయం యొక్క లెక్కలు వేసిన ప్రాచీన శాస్త్రవేత్తలు వ్యయసాయం ఉన్న అన్ని నాగరికతలలో ఉన్నారు. అది వేరు, నువ్వు డబ్బులు దొబ్బడానికి పెట్టుకున్న ఫలిత జోతిష్య దుకాణం వేరు.
మన దేశం లో ఎన్ని పంచాంగాలు ఉన్నాయి ఏమిటీ? నీకు తెలుసా?
అవునూ, నీ పంచాంగం లో ఉత్తరాయణం 14/15 జనవరి లో ఆరంభం అని ఉందా? సారీ, అది ఎప్పుడో 22 రోజులకు పూర్వమే Dec. 21/22 న ఆరంభం అయింది మచ్చా. అమ్మాయి మొదటి సారి ఎప్పుడు రజస్వల అవుతుందో దాని బట్టి వేశ్యగా మారుతుందో లేదో, భర్త ఎప్పుడు చనిపోతాడో చెప్తుందా పుస్తకం?
ఇంకా చాలా ఉన్నాయి. మీరు దాచలేరు.
ఇట్లాంటి తప్పులూ, ఘోరమైన విషయాలూ ఉన్న పంచాంగం చేతిలో పెట్టుకుని జనాలకు రెమెడీలు ఇస్తున్నావా జోతిష్యా? దానికి వాళ్ళు నీకు డబ్బులు సమర్పించుకుంటున్నారా? తెలివైనవాడివే! వాళ్ళు కూడా.
ఇప్పుడు మాట మార్చడానికి మీలో కనీసం ఒక్క తెలివైన వాడు అయినా వచ్చి పాలపుంత లో సూర్యుడు కదలడం లేదా, అట్లా అన్నావేమిటీ అని ఆరా తీస్తాడు.
నాయనా తింగరీ, సూర్యుడికి చలనం లేదని కాదు అంటున్నది. నిజానికి సూర్యుడు చాలా వేగంగా పాలపుంతలో కదులుతూ ఉంటాడు. తల్లికోడి తన కోడి పిల్లలను తీసుకుని తిరిగినట్టు, మన సూర్యుడు కూడా ఎక్కడికి వెళ్తే అక్కడకి తన గ్రహాలనూ, తోకచుక్కలనూ తీసుకునే వెళ్తాడు. మనం మన గ్రహాలూ అందరం కలిసే ఉంటాము, కలిసే కదులుతాము.
గ్రహాలు అంటే గుర్తుకొచ్చింది. నవ గ్రహాలు అంటారు - నీ నవ గ్రహాలలో భూమి లేదు తెలుసా? సూర్యుడిని మీరు గ్రహం అంటారు అంట గా? మళ్లీ సూర్యుడు క్షత్రియుడు అంటా! అందమైన శని గ్రహం నష్టం చేస్తుందని శూద్ర కులం అంటగట్టారా! ఏందిరా భై ఇది? ఇది ఖగోళ విజ్ఞానమా? లేక అంతరిక్షంలో కులవ్యవస్థనా?
రాశులు మగ రాశులు, ఆడ రాశులు, నపుంసక రాశులు అని ఉంటాయా జోతిష్యం లో? అయినా, రాశులు అనే ఐడియా బాబిలోనియన్లు నేర్పారు మన పూర్వీకులకు. వేదాలలో ఇవి లేవు అంటగా. ఇంతకీ జోతిష్యం సైన్స్ నా? మతమా?
నాయనా తింగరీ, ఇక్కడ అర్థం ఏమిటంటే, వాట్ ఐ మీన్ టూ సే ఇస్ థట్ సౌర కుటుంబం వరకూ చూసుకుంటే సూర్యుడు తన చుట్టూ తన గ్రహాలను తిప్పుకుంటాడు. దాని అర్థం భూమి యొక్క కక్ష్య మధ్యలో ఉన్నది సూర్యుడు.
మరి జోతిషూ, మీ పుస్తకాల ప్రకారం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు కదా! దాని అర్థం ఏమిటి? తెలుగు యూనివర్సిటీ లో జోతిష్యం లో ఆర్ట్ డిగ్రీ తెచ్చుకున్నావా? సంతోషం! కానీ, స్కూల్ టెన్త్ పాస్ అయ్యావా? మరి చెప్పు - సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా?
మళ్లీ: పరిభ్రమిస్తున్నది భూమి. సూర్యుడు ఆకాశం లో నువ్వు ఊహించుకున్న ఒక రాశి నుండి నువ్వు ఊహించుకున్న ఇంకో రాశి లోకి వెళ్తున్నాడు అని అనిపించడానికి కారణం భూమి యొక్క భ్రమణం, దాని కారణంగా మారుతున్న ఆకాశం యొక్క బ్యాక్ గ్రౌండ్.
మర్చిపోయా, నేను రైతు బిడ్డను. ఒకప్పుడు రైతును కూడా. ఇది రైతుల పండగ. కృషి తో ఆహారం పండించే ప్రతి ఒక్కరి పండగ. జోతిష్యుల పండగ కాదు. అందుకే అన్నం పొంగించి పొంగల్ చేసుకుంటాము. ఈ పండగకు పొంగల్ అన్నదే కరెక్ట్ పేరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి