5, డిసెంబర్ 2020, శనివారం


#అంబేద్కర్_అందరివాడు. 


 ఈ రోజు భారతదేశపు అణగారిన వర్గాల, ఆశాజ్యోతి, హక్కుల నేత, దేశపు మొట్టమొదటి న్యాయశాఖామంత్రి, రాజ్యాంగ నిర్మాత, ప్రజాస్వామ్య భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశించిన,  భారతరత్న బోధిసత్వ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతిక నిష్క్రమణం చెందిన రోజు. అరవై ఐదేళ్ళు వివిధ రకాల వివక్షకు వ్యతిరేకంగా నిత్యపోరాటంలో గడిపి, బడుగుబలహీనుల, స్త్రీల హక్కులకోసం జీవితాన్ని ధారబోసిన నిత్య కృషీవలుడు, అలసి ఆఖరిశ్వాస వదిలి నేటితో అరవై నాలుగేళ్ళు. ఇన్నేళ్ళ భారతదేశం, ఇన్ని వైరుధ్యాలూ విభిన్నతలూ గల  ఈ దేశంలో పేద ధనిక తేడాల్లేకుండా అందరికీ ఓటు హక్కును తేవడం దగ్గర్నుండి, చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానం అనే తిరుగులేని హక్కును ఈ దేశపౌరులందరికీ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన మహామనీషిని, కేవలం దళితసమూహాల ప్రతినిధిగా కొందరు కుట్రపూరితంగా ప్రచారం చేశారుగానీ, నిజానికి ఆయన అందరివాడు, విశ్వమానవుడు.  


ఆయన ఆలోచనా విధానం గత కొన్నేళ్ళుగా విస్తృతంగా భారతదేశాన్ని ఆవరించడం నిజమే, కానీ, బ్రతికున్నరోజుల్లో సైతం "బడుగుబలహీన సమూహాలచేతగానీ, కులాల అంతరాలను మెచ్చని మేధోవర్గం చేతగానీ ఆయన మిక్కుటంగా ప్రేమింపబడ్డ వ్యక్తి" అంటారు ఆయన సన్నిహితులు. ఆయన సహాయకుడూ, అత్యంత సన్నిహితుడూ ఐన, నానక్ చంద్ రత్తూ రచించిన "రిమినిసెన్సెస్ అండ్ రిమెంబరెన్సెస్ ఆఫ్ డా. బీఆర్ అంబేడ్కర్" అనే పుస్తకంలో ఆయన ఇలాంటి ఎన్నో వాస్తవాలు పొందుపర్చారు. బాబాసాహెబ్ మరణించినపుడు లక్షలాదిగా కన్నీళ్ళతో తరలివచ్చిన ప్రజలను ఆయన గుర్తుచేసుకొంటూ, "ఆయన్ని దళితజాతి మాత్రమే కాదు, భరతజాతి ముద్దుబిడ్డగా అభివర్ణిస్తారు. అందుకే ఎప్పటిలా కాకుండా ఈ వ్యాసంలో, బాబాసాహెబ్ ఒక నాయకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగా, ఉద్వేగపూరితుడిగా, అందర్నీ ప్రేమించే సున్నిత స్వభావుడిగా, ప్రేమామయుడిగా ఎలా ఉండేవాడు, మరణానికి ముందు కొంతకాలంగా అస్వస్థుడిగా ఉన్న ఆయన, ఆఖరిగా ఏం మాట్లాడారు, తనప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారు, ఆయన తీరని ఆశలు ఏమిటి తదితర విషయాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.


అందరికీ తెలిసిందే అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాకి చెందిన మ్హౌ అనే కంటోన్మెంట్ ఏరియాలో, రాంజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు పధ్నాలుగో సంతానంగా జన్మించారని. నిజానికి వారిది రత్నగిరి జిల్లా లోని దపోలి. ఈస్టిండియా కంపెనీ ఇండియాని పాలించడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అంబేద్కర్ కుటుంబీకులు ఆర్మీలో పనిచేసారు. అంబేద్కర్ పుట్టేనాటికి అతడి తండ్రి ఆర్మీలో సుబేదార్ ర్యాంకులో సేవలందిస్తూ ఉన్నారు. పుట్టిన వారిలో ఏడుగురు అప్పటికే చనిపోగా, కనిష్టుడైన అంబేడ్కర్ను "భీవా" అని ముద్దుగా పిల్చుకుంటూ, ఎంతో గారాబంగా పెంచారు ఇంటిల్లిపాదీ. బాల అంబేద్కర్ మొండివాడు, తాననుకున్నదే జరగాలనే గట్టిపట్టు పట్టేవాడిగా ఉండేవాడు, తోటిపిల్లలతో గొడవలకు కూడా దిగేవాడు. గెలిచి తీరాలన్న పట్టుదల అతడిలో చిన్నప్పటినుండీ కనిపించేది. చాలామంది అనుకుంటున్నట్టు, అంబేడ్కర్ కుటుంబం పేదది కాదు, అంబేడ్కర్ పుట్టిన కొద్దిరోజులకే రాంజీ సక్పాల్ రిటైర్ అవ్వడంతో, కుటుంబాన్ని దపోలిలో వదిలి, తాను గోరేగావ్ అనే ఊరిలో క్యాషియర్ పనిలో చేరారు. పుట్టిన కొద్దిరోజులకే తల్లిని పోగొట్టుకున్నాడు భీవా. ఆ తర్వాత అనతికాలానికే అతడి కుటుంబం దపోలి వదిలి సతారా చేరుకుంది. తల్లిలేక, అక్కలకు పెళ్ళిళ్ళైపోయి, ఉన్న అత్తకి ఆరోగ్యం బాలేని పరిస్తితుల్లో,  వంట చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం కష్టంగా ఉండేదని ,అందుకే అన్నం మాంసం కలిపి ఎక్కువగా పులావ్ వండేసుకునే వారిమనీ, నెమరువేసుకుంటారు బాబాసాహెబ్ తన స్వీయకధలాంటి "వెయిటింగ్ ఫర్ ఎ విజా" పుస్తకంలో.


అందరూ అనుకున్నట్లు, పుట్టింది మొదలు బాబాసహెబ్ అంటరానితనం అనుభవించలేదు. "మిలటరీ క్వార్టర్స్ లో, ఒక సుబేదార్ బిడ్డలుగా వారిపై ఎలాంటి వివక్షా వుండేది కాదనీ, సతారాకి వచ్చాక, ఒకసారి వేసవి సెలవులకి,  మరో ఊరిలో పనిచేస్తున్న వాళ్ళ తండ్రిగారిని కలవడానికి పిల్లలందరూ బయల్దేరినపుడు జరిగిన సంఘటనలు తనకు అంటరానితనం ఎంతటి అమానుషమైన ఆచారమో తెలిసేలా చేసాయనీ, పసిపిల్లలైన తమకు రోజంతా పచ్చి మంచినీళ్లు పుట్టకుండా చేసిన ఆ సంఘటన తన మనసులో తీవ్రంగా నాటుకుపోయిందనీ,  "మనిషిని మనిషి తాకితే మైల పడడం ఎలా సాధ్యం?" అని తనని పదే పదే ప్రశ్నించే విదేశీయులకు, కుల వివక్షను అర్ధం అయ్యేలా చెప్పడానికి తాను ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందనీ" అంబేద్కర్ ఆ పుస్తకం మొదటి పేజీల్లో చెప్పారు. తన జీవితం నుండీ ,తాను సన్నిహితంగా చూసిన వారి జీవితాల నుండీ కులవివక్ష తీవ్రంగా బాధించిన సన్నివేశాలను వివరించడం ద్వారా, కుల వివక్ష యొక్క స్వరూపాన్ని తెలియజేయడానికి ప్రయత్నించారు అంబేడ్కర్, మరి ఆ పుస్తకానికి "వెయిటింగ్ ఫర్ ఎ విజా" అని శీర్షిక పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆయనెక్కడా చెప్పినట్టు లేరు, ఈ పుస్తకం అసంపూర్తిగా ఉండగానే ఆయన మరణించారు.


ఈనాడు ప్రపంచం మొత్తం బాబాసహెబ్ ను ఒక మహామనీషిగా, అణచివేయబడ్డ జాతుల హక్కులకోసం జీవితాంతం శ్రమించిన కృషీవలుడిగా, ప్రపంచంలోనే గొప్ప మేధావిగా గుర్తించింది. ఆయనకున్నన్ని డిగ్రీలు కూడా మరింకెవ్వరికీ లేవని, మహోన్నత విద్యావేత్తగా, ప్రపంచమేధావిగా ఆయన్ని గౌరవిస్తోంది. భారతదేశం మొత్తంలోనే,  విదేశీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లో డాక్టరేట్ అందుకున్న మొట్టమొదటి వ్యకి డా. బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవన్నీ రోజూ మనం వింటూ ఉండే మాటలే అంబేద్కర్ గురించి. ఐతే, చదువు అంటే తెలియని సాంఘిక వెలివేతలో ఉన్న తమ సమూహాల నుండి, తమ బిడ్డను ఎలాగైనా విద్యావంతుడ్ని చేయాలనే పట్టుదల పట్టింది మాత్రం అంబేద్కర్ తండ్రి రాంజీ సక్పాల్. కొడుకులిద్దర్నీ స్కూల్లో వేయడమే కాకుండా, ఇద్దరి ఫీజులకీ తన పెన్షన్ సరిపోకపోవడంతో ఆ తర్వాత పెద్దకొడుకు బలరాంని కూడా చిన్న ఉద్యోగంలో చేర్పించి అంబేద్కర్ ని మాత్రం ఎల్ఫిన్స్టన్ హైస్కూల్లో, ఇంగ్లిష్ మీడియంలో జేర్పించాడు. అంటరానివాడు కావడం వల్ల ఎవ్వరూ అతడితో మాట్లాడకపోవడంతో,  భీవా ఒక్కడే వెళ్ళి సమీపాన ఉన్న తోటల్లో గంటలు గంటలు చదువుకునేవాడట. అలాంటి సమయాల్లో స్థానిక విల్సన్ హైస్కూలు ప్రిన్సిపాల్, సామాజిక వేత్త ఐన కేలుస్కర్ గారు భీవాని చూసి, ఆపై అతడి ఉన్నత విద్యను అభ్యసించడంలో ఎంతో సహకరించడం జరిగింది. అలాగే మరో బ్రాహ్మణ టీచర్ కూడా చదువులో భీవా యొక్క సూక్ష్మగ్రాహ్యతను గమనించి, ఆ అబ్బాయి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళే అవసరం లేకుండా భోజనం ఏర్పాటు చేసారు. భీమ్రావ్ రాంజీ అంబావడేకర్ ఐన తన పేరు, ఆ తదుపరి స్కూలు రికార్డుల్లో "అంబేద్కర్" గా నమోదవ్వడానికి కారణం ఉత్తమ బుద్ధిగల ఆ ఉపాధ్యాయుడే అన్నది గెయిల్ ఓంవిడ్త్ అనే అంతర్జాతీయ రచయిత్రి రాసిన "అంబేద్కర్: టువార్డ్స్ యాన్ ఎన్లైటెన్డ్ ఇండియా"అనే పుస్తకంలో ప్రస్తావించబడింది.


తాను బియ్యే పాసవ్వాలని తన తండ్రి ఎంతో శ్రమించాడని అంబేద్కర్ చెప్పేవారు. తాను ప్రశాంతంగా చదువుకోవాలని తెల్లవారుఝామున రెండింటికే లేపేవారని, ఇంగ్లిష్, హిందీ అనర్గళంగా మాట్లాడగలిగే, రాయగలిగే తన తండ్రికి, తాను మామూలుగా కాకుండా డిస్టింక్షన్లో పాస్ కావాలని ఆశగా ఉండేదని, ఐతే తాను మొదట్లో తండ్రి ఆలోచనను పెద్దగా పట్టించుకోలేదనీ ,కానీ 1904 లో బొంబాయి వెళ్ళాక కావాల్సిన పుస్తకాలు లభ్యమౌతుండడంతో తనకూ చదువుపై మక్కువ కలిగిందనీ చెప్పేవారు బాబాసాహెబ్. కొడుకు బాగా చదవాలని ఒకటే వెన్నంటి ఉండి పోరుపెట్టేవారు రాంజీ. ప్రతిభావంతుడైన తన బిడ్డ అడిగిన పుస్తకం ఎంత ఖరీదైనాసరే,  తన పెన్షన్ డబ్బులతో కొనేసేవారట సక్పాల్. తన వద్ద డబ్బు ఐపోయినపుడు, తన సోదరి వద్దకు వెళ్ళి ఆమె నగలు తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చి పుస్తకాలు కొని, మళ్ళీ తన పెన్షన్ వచ్చాక ఆమె నగలు విడిపించేవారట. ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు, ఈనాటి సమాజం ముఖ్యంగా దళిత సమాజం ఆయన జీవించిన విధానం చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందనిపిస్తుంది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలంటే చుట్టూ ఎలాంటి వాతావరణం సృష్టించాలి, అందుకు తల్లిదండ్రుల కృషి, శ్రమ ఏ స్థాయిలో ఉండాలీ అనేది అంబేద్కర్ తండ్రిగారిని చూస్తే అర్ధం ఔతుంది.


ఈ విషయాలన్నీ పంతొమ్మిదో శతాబ్ధం మొదట్లో, అంబేద్కర్ టీనేజర్ గా ఉన్నప్పటి సంఘటనలు. మరి వందేళ్ళ తర్వాత కూడా మెజారిటీ దళిత సమాజం అంతటి విద్యను సాధించిందా అంటే, సమాధానం వెంటనే చెప్పలేం. తల్లిలేని పిల్లవాడు,ఇంట్లో మంచీ చెడ్డా చూసుకునే ఎవ్వరూ లేనివాడు, తండ్రి యొక్క పట్టుదలను అర్ధం చేసుకొని రేయింబవళ్ళు చదవడం, ఆ తండ్రి, తలను తాకట్టు పెట్టైనా బిడ్డకు కావాల్సిన పుస్తకాలనూ ఫీజునూ సమకూర్చడం..ఒక సామాన్య వ్యక్తి యొక్క అసామాన్య విజయాలను మనం ఈరోజు వేనోళ్ళ కొనియాడుతున్నాం కానీ, ఆ విజయాల వెనుక ఉన్న కఠోర పరిశ్రమని మనలో ఎవరమైనా  పరిశీలించామా? ఆయన్ని ఒక సమూహానికే పరిమితం చేసి,సమానత్వ సమాజంకోసం, ఆయన అవిశ్రాంతంగా సలిపిన  శ్రమను ప్రజలకు తెలియజేయకుండా, పాఠ్యపుస్తకాల్లో ప్రచురించకుండా ఆయన్ని ఏడాదికి రెండుసార్లు పొగిడేసి చేతులు దులుపుకోవడం సమంజసమా? 


ఆయన విగ్రహాలని తమ మొగసాలల్లో ఒక ఆలంబనగా ప్రతిష్టించుకునే సమూహాలకు, కుల వివక్ష అనే క్యాన్సర్ ని నిరోధించడానికి ఆయన ఎంతగా తనను తను ఉపేక్షించుకొని, చట్టాలనన్నింటినీ ఔపోసన పట్టాడో అర్ధం చేసుకున్నాయా? ఇప్పటికైనా ఆయన్ని ప్రేమించే సమాజం, ఆయన పట్టుదలని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన్ని దేవుడిగా కొలవడం కంటే ఆయనలాంటి మేధోసంపదని వారసత్వంగా గ్రహించడానికి అణగారిన వర్గాలు శ్రమించాలి. ఆర్ధికంగా ఎదిగిన దళితులు అంబేద్కర్ నిర్దేశించిన "పే బ్యాక్ టు ద సొసైటీ"ని సీరియస్ గా అమలుచేయాలి.


"మరణానికి కొన్నేళ్ళ ముందునుండీ బాబాసాహెబ్ ఆరోగ్యం బావుండేది కాదు. హిందూకోడ్ బిల్లు, రాజ్యాంగ రచన..వీటిల్లో,ఆయన ఇతర పుస్తకాల రచనల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నపుడే ఆయనకు అపెండిసైటిస్, హైబీపీ, కీళ్లనొప్పులు ఉండేవి. ఆపై ఆయనకు చక్కెర వ్యాధికూడా సోకింది. తాను స్థాపించిన "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా" పార్టీని నడుపుతారని, ఆయన ఆశయాల రధాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మిన వారు అధికారంకోసం ఆయనకు ద్రోహం చేయడం ఆయన్ని కుదిపేసింది. తాను నమ్మిన తనవారే మోసం చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. మందులు పనిచేయడం మానేసాయి. 1955 జనవరి నుండీ ఆయనలో మార్పు కొట్టొచ్చినట్టు కానరాసాగింది. బరువుతగ్గి, కంటి చూపు క్షీణించి, స్నానం చేయడానికీ, చిన్నచిన్న దూరాలు నడవడానికీ సైతం ఒకరి సాయం కావాల్సివచ్చేంతగా ఆయన నీరసపడిపోయారు. "ఇకపై నేను రాయలేనేమో రత్తూ, నేను అనుకున్న పుస్తకాలు పూర్తిచేయలేనేమో" అని మధనపడేవారు. ఏమీ తినడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన్ని వేయి కన్నులతో కాపాడుకుంటూ ఆ మహామనీషి పక్కనే ఉండే అదృష్టం మాత్రం నాకు దక్కింది" అని గుర్తుచేసుకుంటారు బాబాసాహెబ్ ఆంతరంగికుడు, సహాయకుడు నానక్ చంద్ రత్తూ తన పుస్తకంలో.


"1956 జూలై 31 మంగళవారం ఆయన పడక్కుర్చీలో పడుకొని నాకు నోట్సు చెప్పడం ఆరంభించారు.అలా చెప్తూ చెప్తూ నిద్రలోకి జారిపోయారు. ఆయన తలని సరిగ్గా సర్ది, నేను అలా ఆ అలసిన ముఖాన్ని చూస్తూ కూర్చున్నాను. ఆపై ఆయనలేచి, కొన్ని ఉత్తరాలకు జవాబులు చెప్పారు.  తర్వాత మెల్లగా లేచి బెడ్రూలోకి నడిచారు, ఆయన తలను మెల్లిగా మర్దనా చేస్తుండగా ఆయన ఈ మాటలు చెప్పారు. "నా వేదన ఏంటంటే, నేను నా జాతికోసం ఏదైతే ఆశించానో అది జరగలేదు. ఇతర సమూహాలతో పాటూ నా జాతికూడా పరిపాలనను పంచుకోవడం చూడాలని ఎంతో ఉవ్విళ్ళూరాను. "నేనేదైతే సాధించి పెట్టానో దాన్ని, కొందరు విద్యావంతులు తమ స్వార్దానికి వాడుకున్నారే తప్ప, తమ వెనుక ఇంకా వివక్షలో జీవిస్తున్న తమ వర్గాల సోదరులకు అందించలేదు. వీళ్ళంతా స్వార్ధపరులు. నేనిప్పుడు నా ఆలోచనంతా గ్రామాల్లో అత్యంత హీనమైన రీతిలో బాధపడుతున్న అభాగ్యులవైపు మళ్ళించుకోవాలి అనుకుంటున్నాను. కానీ అంత సమయం లేదనిపిస్తుంది. నేను బ్రతికి ఉండగానే నేను రాసిన పుస్తకాలన్నీ అచ్చులో చూడాలి అనుకున్నాను, అదీ సాధ్యపడేలా లేదు.అది అసాధారణమైన పని, నా తర్వాత ఎవరూ ఆ పని చేయలేరేమో అనే బాధ నన్ను కృంగదీస్తుంది, నా తర్వాత బాధిత సమూహాలనుండి ఎవరైనా సమర్ధులు ఈ బరువైన బాధ్యతను కొనసాగిస్తారేమోనని ఆశించాను. కానీ ఎవ్వరూ వచ్చేలా లేరు"


"..కులవివక్షలాంటి మహాజాఢ్యం వేళ్ళూనుకుని ఉన్న దేశంలో పుట్టడమే ఒక శాపం.."అంటూ కళ్ళల్లో నీళ్ళతో చివరిసారిగా విస్తరించి సంభాషిస్తూ, "నానక్ చంద్, నేనేదైతే సాధించానో అది ఒంటిచేత్తో సాధించాను, అవమానాల మధ్య వేదనల మద్య నలిగిపోతూ, శత్రువులతో నిరంతరం యుద్ధం చేస్తూ,ఈ రధాన్ని ఇక్కడివరకూ చేర్చాను. అణచివేయబడ్డ కులాలు గౌరవ ప్రదమైన జీవితం జీవించాలంటే, వాళ్ళు ఇకపై కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూనే ఈ రధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేయలేని పక్షంలో దాన్ని ఉన్నచోటే వదిలెయ్యాలి తప్ప, ఎట్టిపరిస్తితుల్లోనూ ఈ రధాన్ని వెనక్కి మాత్రం తీసుకెళ్ళరాదు. ఇది నా చివరి సందేశం, ఈ మాటలు వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు" అంటూ మూడుసార్లు ఉద్వేగంగా పలికారని రత్తూ తన పుస్తకంలో రాసుకున్నారు.


అంబేద్కర్ ఒక మేధో విస్ఫోటనం. బ్రతికిన అరవై ఐదేళ్ళలో ఆయన తనకోసం బతికిన రోజుల్ని వేళ్ళపై లెక్కపెట్టొచ్చేమో. ప్రజాస్వామ్య సమాజాన్ని అంతగా కలలుకన్న ప్రేమామయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్. బాధిత సమూహాల మానవ హక్కుల పట్ల, సాంప్రదాయాలపేరుతో స్త్రీలపై అణచివేతను రూపుమాపడం పట్లా, తన తిరుగుబాటును తుపాకులతో తూటాలతో కాకుండా రాజ్యాంగంలో చట్టాల రీతిన పటిష్టంగా పొందుపరచి, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దిన మహామనీషి. భారతదేశపు అణగారిన వర్గాలు మాత్రమే కాదు, ఈ దేశపు ప్రతీ పౌరుడూ పౌరురాలూ అన్ని హక్కులతో ప్రశాంత జీవనం గడపడానికి నిరంతరం శ్రమించి బాటలు వేసిన ఆయన, భౌతికంగా నిష్క్రమించి అరవైనాలుగు సంవత్సరాలు గతించినా, ఆయన ఆలోచనలే వివిధ చట్టాల రూపంలో ఈ దేశాన్ని నడిపిస్తున్నాయంటే, కోట్లాదిగా జనాభా ఉన్న ఈ దేశాన్ని ఇన్నాళ్ళపాటు ఎలాంటి సాంఘిక ,రాజకీయ ఆర్ధిక విపత్తూ కదిలించలేదంటే దానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగమూ ఆయన చేసిన చట్టాలూ మాత్రమే.

భారతీయులందరూ ఇకనైనా తెలుసుకోవాల్సిన సత్యమిది, ఆ ప్రేమమూర్తిని హత్తుకోవాల్సిన సమయమిది.


( ఈ రోజు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 64 వ మహాపరినిర్వాణ దివస్)


అరుణ గోగులమండ. 

రచయిత సామాజిక విశ్లేషకురాలు.

27, ఏప్రిల్ 2020, సోమవారం

*రోడ్డు పక్క టిఫిన్ బండి లో ప్లేట్లు కడిగే స్థితి నుండి సినిమా దర్శకుడి స్థాయికి ఎదిగిన*

*1978 పలాస* 

డైరెక్టర్ కరుణ్ కుమార్ జీవిత కథ

కొందరు సినిమావాళ్ల జీవితంలో వాళ్లు తీసే చిత్రంలోకన్నా ఎక్కువ నాటకీయతా సాహసాలూ కనిపిస్తుంటాయి. కరుణకుమార్ జీవన ప్రయాణం అలాంటిదే.

 ‘పలాస 1978’తో తెలుగు చిత్రసీమకి ఓ విలక్షణ చిత్రాన్నందించి ప్రశంసలు అందుకున్న కరుణకుమార్ ...

పదిహేనేళ్ల వయసులో హోటల్లో ప్లేట్లు కడగడంతో జీవితాన్ని మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదిగి ఆంత్రప్రెన్యూర్ గా మారాడు. అదే సాహసంతోనే సినిమాలవైపూ వచ్చాడు. ఆ ప్రయాణం ఆయన మాటల్లోనే...
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని ఓ కుగ్రామం మాది. పేరు కంట్రగడ. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందా పల్లెటూరు. అప్పట్లో మానాన్న సాగుచేస్తూ ఉన్న ఆరు సెంట్ల భూమే మాకున్న ఏకైక ఆస్తి. కానీ ఊరిలో ఒక్కసారిగా నక్సలైట్ల ప్రభావం హెచ్చింది. అన్నలు వందల ఎకరాలున్న కామందుల భూములతోపాటూ మా ఆరుసెంట్లనీ అక్కడి గిరిజనులకి పంచేశారు! అలా మాకున్న ఒకే ఒక జీవనాధారం పోయింది. కడుపు నిండటమే కష్టమైంది. అప్పుడు నేను పదో తరగతి పాసై ఉన్నాను. పై చదువులకి వెళ్లే స్థోమత లేకున్నా సరే నాన్న నన్ను చదివించాలనుకున్నాడు. శ్రీకాకుళం పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేర్చాడు. అక్కడ ఆయనకు తెలిసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లో ఉంటూ చదువుకునే ఏర్పాటుచేశాడు. కాలేజీకి వెళుతున్నానన్న మాటేకానీ ఇంటికొచ్చి కనీసం పుస్తకంపట్టే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు ఆ ఇంట్లోవాళ్లు. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్షణం తీరికలేకుండా ఏదో ఒక పని చెబుతూ ఉండేవారు. అప్పటికే సరైన ఆహారం లేక అర్భకంగా ఉండే నన్ను ఆ పనులు మరింతగా కృశించేలా చేశాయి. ఇదే కాయకష్టం నేను బయట చేస్తే కనీసం నాలుగు డబ్బులైనా చేతికొస్తాయనే ఆలోచన వచ్చింది. దాంతో ఓ రాత్రి ఆ ఇంటి నుంచి బయటపడ్డాను. బస్సెక్కి ఆముదాలవలస రైల్వే స్టేషన్ కి చేరుకున్నాను. ఓ రైలొస్తే అది ఎక్కడికి వెళుతుందో కూడా చూసుకోకుండా ఎక్కేశాను. టీటీఈ కంటపడకుండా రాత్రంతా లెట్రిన్ లో దాక్కున్నాను. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... ఆ తర్వాతి రోజు నేను కళ్లు తెరిచేసరికి ట్రెయిన్ చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ఉంది!
తెలియని ఊరు... అర్థంకాని భాష. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్ లోనే ఉండిపోయాను. ఆకలైతే అక్కడున్న కొళాయి నీళ్లతోనే కడుపు నింపుకున్నాను. మరీ తట్టుకోలేకపోతే ప్రయాణికుల దగ్గరకెళ్లి అడిగితే తాము తింటున్నదాంట్లో కొంత పెట్టేవారు. అమ్మావాళ్లు గుర్తుకొచ్చి ఏడుపొచ్చినా డబ్బు సంపాదించకుండా వాళ్ల దగ్గరకెళ్లకూడదనుకున్నాను. నా చావో బతుకో ఇక్కడే తేలిపోవాలనుకున్నాను. అలా ఐదు రోజులూ స్టేషన్ లోనే గడిపాను. ఓసారి బాగా ఆకలిగా అనిపించి ఓ ప్రయాణికుడి దగ్గరకెళితే ఆయన చేతిలో తెలుగు పత్రిక కనిపించింది. తెలుగువాళ్లనగానే ప్రాణం లేచి వచ్చి ‘ఆకలవుతోంది... సార్ !’ అన్నాను. వెంటనే ఆయన స్టేషన్ బయట ఉన్న హోటల్ కి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించాడు. నా కథంతా విన్నారు. ‘నువ్వు స్టేషన్ లోనే ఉండిపోతే ఆకలితో చచ్చిపోతావ్ . ఇక్కడ ఏదైనా హోటల్ లో పనిచెయ్ ... కనీసం మూడుపూటలా అన్నమైనా పెడతారు..!’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన చెప్పినట్టు స్టేషన్ కి దగ్గర్లో బ్లూ స్టార్ అనే హోటల్ కి వెళ్లి పని అడిగాను. కొత్తవాళ్లకి ఇవ్వలేమని చెప్పేశారు. అప్పుడు ఆ హోటల్ పక్కన రిక్షాపైన అన్నం వండి అమ్ముతూ ఉన్న ఓ కుటుంబం కనిపించింది. నేను వాళ్లకి సాయంగా ప్లేట్లు కడగటం మొదలుపెట్టాను. వాళ్లు నాకు మూడుపూటలా భోజనం పెట్టేవారు. అదే నా తొలి ఉద్యోగం! వాళ్ల గుడిసె దగ్గరే ప్లాట్ ఫామ్ పైన పడుకునేవాణ్ణి నేను. అక్కడ పరిచయమైన స్నేహితుడొకడు చెన్నైలోని ఉడుపి హోటల్ లో పనికి కుదిర్చాడు. ఆ హోటల్ వడపళని అనే ప్రాంతంలో ఉంటుంది. విజయవాహిని సినిమా స్టూడియో ఉండేది కూడా అక్కడే! ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు ఎక్కువ కాబట్టి పాత తెలుగు పుస్తకాలు బాగా దొరికేవి. అప్పటి నుంచి అవే నాకు నేస్తాలయ్యాయి. అప్పటికి నేను ఇల్లు వదిలి ఆరునెలలు. అప్పుడప్పుడూ అమ్మావాళ్లు గుర్తొచ్చేవారు. ఒక్కగానొక్క కొడుకు కానరాక వాళ్లెంత అల్లాడిపోతారో అనే ఆలోచనొస్తే బాగా ఏడుపొచ్చేది. వెంటనే నేను ఫలానా చోట ఉన్నానంటూ ఓ జాబు రాయటం మొదలుపెట్టేవాణ్ణి. వెంటనే ‘మీవాడు చెన్నైలో కప్పులు కడుగుతున్నాడట...’ అని నలుగురూ అంటే వాళ్లకెంత అవమానం!’ అనుకుని రాసిన ఉత్తరాలు చించేసేవాణ్ణి. ఇలా అయినవాళ్లతో సంబంధాలు తెంచుకోవడం వల్ల బాగా ఒంటరితనంగా అనిపించేది. ఆ ఒంటరి తనాన్నంతటినీ పుస్తకాలే పొగొట్టాయి. అప్పట్లో యండమూరి నవలలు నాకెంతో స్ఫూర్తినిచ్చేవి. వాటిని చదవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆలోచనలన్నింటినీ డైరీలా రాసుకోవడం మొదలుపెట్టాను. నా రచనలకి బీజం అక్కడే పడింది.
ఉడుపి హోటల్లో చేరానని చెప్పాను కదా... అక్కడ హోటల్ బయట ఊడవడంతో మొదలుపెట్టి ప్లేట్లు కడగడం, టేబుళ్లు తుడవటం, తర్వాత అక్కడి ప్రధాన చెఫ్ కి సహాయకుడిగా మారడం... ఇలా చాలా అంచెలు దాటాక నన్ను బిల్లింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు... హోటల్ లో ఉద్యోగాల పరంగా అది ఓ పెద్ద ప్రమోషన్ లాంటిది! కాలేజీకి వెళ్లకున్నా సాహిత్యాన్ని చదువుతుండటం వల్ల నా మాట తీరూ, మన్ననా చూసి మా హోటల్ కి తరచుగా వచ్చే ఒకతను ‘సైఫన్ ’ అనే రొయ్యల సాగు సంస్థలో నన్ను ఆఫీస్ బాయ్ గా చేర్చాడు. ఆఫీస్ వాతావరణం నన్ను చాలా మార్చింది. ఖాళీ సమయంలో సాహిత్యంతోపాటూ స్పోకెన్ ఇంగ్లిషు, టైపింగ్ , కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఏడాది తిరక్కుండానే కంప్యూటర్ ఆపరేటర్ ని అయ్యాను. ‘టాలీ’ సాఫ్ట్ వేర్ అప్పుడప్పుడే మార్కెట్ లోకి వస్తుంటే దానిపైన పట్టు సాధించడంతో ఆ సంస్థకి నన్ను అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా చేశారు. ఒక్కసారిగా నా జీవితం మారిపోయింది. మూడేళ్లు అక్కడ పనిచేశాక... అమ్మానాన్నల దగ్గరకెళ్లడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. అలా ఊరొదిలి వచ్చిన పదేళ్ల తర్వాత ఇంటి బాట పట్టాను.
ఊరి పొలిమేరలోనే కనిపించిన నాన్న ఎదురుగా నిల్చుంటే ఆయన నన్ను గుర్తుపట్టలేదు. ఎంత చెప్పినా నేను నేనేనని నమ్మలేదు. నేను ఊరొదిలి వచ్చేటప్పుడు విజయనగరం ప్రాంతంలో తోటపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుండేది. ఆ నిర్మాణానికి మగపిల్లల్ని బలిస్తున్నారంటూ వదంతులు రేగుతుండేవి అప్పట్లో. నేను కూడా అలా బలైపోయానని అనుకున్నాడట. అంటే...వాళ్ల దృష్టిలో నేను చచ్చిపోయానన్నమాట! అన్నేళ్లు నేను వాళ్లకి సమాచారం ఇవ్వకుండా ఉన్నందుకు తొలిసారి పశ్చాత్తాపపడ్డాను. ఆయన్ని హత్తుకుని తన కొడుకుని నేనేనంటూ ఏడ్చాను. అమ్మతో నాకింత సమస్యరాలేదు. నాన్నతో వస్తున్న నన్ను చూడగానే తన కన్నపేగు కదిలినట్టుంది... భోరుమంటూ వచ్చి హత్తుకుంది. మూడునెలలపాటు అమ్మానాన్నల్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదు నేను. ఆ తర్వాత విశాఖలో ‘హాలిడేస్ వరల్డ్ ’ అనే పర్యటనల నిర్వహణ సంస్థలో చేరాను. కార్పొరేట్ సంస్థల నుంచి వీఐపీల దాకా వాళ్లక్కావాల్సిన దేశీ, విదేశీ పర్యటనల్ని నిర్వహించే సంస్థ అది. అందులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా చేరి ‘టూర్ మేనేజర్ ’గా ఎదిగాను. ఆ కంపెనీలో పనిచేస్తున్న నీలిమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాది కులాంతర వివాహం. నా జీవితాన్ని ‘నీలిమకి ముందు, ఆ తర్వాత’ అని చెప్పొచ్చు. ఉద్యోగిగా ఉన్న నేను ఆంత్రప్రెన్యూర్ గా మారానన్నా... రచనలవైపు సాగానన్నా... ఇప్పుడు సినిమా దర్శకుణ్ణయ్యానన్నా అంతా తన చలవే. ‘హాలిడేస్ వరల్డ్ ’ సంస్థలో ఉద్యోగిగా ఉంటున్న నేను దాని ఫ్రాంచైజీ తీసుకుని హైదరాబాద్ లో ఆఫీసు తెరిచాను. కానీ తొలి ఆరేడునెలలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఆటుపోట్లకి గురైతే ఆ బాధలన్నీ నా భార్యే పంటిబిగువున భరిస్తూ కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. మొదట్లో ఆటుపోట్లు వచ్చినా సంస్థ లాభాల బాట పట్టింది. ఇంతలో ‘పసిఫిక్ ట్రయల్స్ ’ అనే ఎమ్మెన్సీ సంస్థ నన్ను డిప్యుటీ జనరల్ మేనేజర్ గా చేరమంది. సింగపూర్ లో ఉద్యోగం. 2003లోనే ఆరు అంకెల జీతం. కానీ భార్యాపిల్లలకి దూరంగా ఉండటంలో అర్థంలేదు అనిపించి రాజీనామా చేసి మళ్లీ హైదరారబాద్ వచ్చాను. ‘నవదీప్ హాలిడేస్ ’ అనే పర్యటక సంస్థని స్థాపించాను. అనతికాలంలోనే బజాజ్ అలయెన్జ్ వంటి సంస్థల ఉద్యోగులూ మా వినియోగదారులుగా మారారు!
పదిహేనేళ్లప్పుడు సాహిత్యంతో ఏర్పడ్డ సాహచర్యాన్ని నేను వదులుకోలేదు. హైదరాబాద్ వచ్చాక మహ్మద్ ఖదీర్ బాబు, కుప్పిలి పద్మ, మహీ బెజవాడ వంటి రచయితలు పరిచయమయ్యారు. వాళ్లు నిర్వహించే వర్క్ షాపుల ద్వారా ‘చున్నీ’, ‘పుష్పలత నవ్వింది’, ‘498’, ‘జింగిల్ బెల్స్ ’... వంటి ఆరు కథలు రాశాను. అవి వివిధ సంపుటాలూ, పత్రికల్లో అచ్చయ్యాయి. వీటిలో ‘పుష్పలత నవ్వింది’ కథ ఐదు భాషల్లోకి అనువాదమైంది. అప్పుడే నేనూ రచనయితనేననే నమ్మకం వచ్చింది. అప్పట్లో హైదరాబాద్ లో ‘చతురులు’ పేరుతో స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తున్న వాళ్లతో కలిసి నేనే స్క్రిప్టు రాసి ప్రదర్శనలివ్వడం ప్రారంభించాను. వాటిని చూసిన దర్శకులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ప్రదీప్ అద్వైత్ ల ద్వారా ప్రశాంత్ వర్మ పరిచయమయ్యాడు. అలా ఆయన తీసిన ‘అ!’ సినిమాకి పనిచేశాను. ఆ సినిమాకి మంచి పేరొచ్చాక నాకు దర్శకుడిగానూ మారాలనిపించింది. 2016లో కేంద్ర స్వచ్ఛభారత మిషన్ షార్ట్ ఫిల్మ్ ల పోటీ పెడితే గంటలో స్క్రిప్టు తయారుచేసి ‘చెంబుకు మూడింది...’ అనే చిత్రం తీసి పంపాను. దానికి జాతీయస్థాయిలో రెండో బహుమతి వచ్చింది! ఆ తర్వాత గత వందేళ్లుగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అమూల్యమైన కథల్ని తెరకెక్కించాలనిపించింది. అందుకు శ్రీకారంగా మహ్మద్ ఖదీర్ బాబు రాసిన ఓ కథని ‘ప్రణతి’ అని షార్ట్ ఫిల్మ్ గా తీశాను. దాన్ని చూశాకే తమ్మారెడ్డి భరద్వాజ్ పిలిచి సినిమా కథలున్నాయా అని అడిగితే... ‘పలాస 1978’ సినిమా కథ ప్లాట్ చెప్పాను. నేను మా ఊర్లో చూసిన జానపద కళాకారుల జీవితమే దాని నేపథ్యం. భరద్వాజ్ ద్వారా ధ్యాన్ అట్లూరి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. నాకు బెంగాలీ, మలయాళం, తమిళ సినిమాల స్టైల్ ఇష్టం కాబట్టి... నా సినిమాలో స్మాల్ టౌన్ వాతావరణాన్ని చూపిస్తూ వాస్తవికతకి పెద్దపీట వేయాలనుకున్నాను. ఆన్ లైన్ లో డైరెక్షన్ , ఎడిటింగ్ మెలకువలపైన శిక్షణ తీసుకుంటూనే ఈ సినిమా తీశాను! నా ఆలోచనల్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులూ దొరకడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు నేను.
‘పలాస 1978’ సినిమా మార్చి మొదట¨వారంలో విడుదలైంది. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ప్రేక్షకులు థియేటర్ లకి రావడం మొదలుపెట్టారు. చిత్రం లాభాలు తెస్తోందని అనుకుంటూ ఉండగానే కరోనా లాక్ డౌన్ మొదలైంది. దాంతో అమెజాన్ ప్రైమ్ లో దాన్ని విడుదల చేశాం. ఈ సినిమాని చూసిన అల్లు అరవింద్ నన్ను పిలిచి చెక్ చేతిలోపెట్టి ‘గీతా ఆర్ట్స్ తర్వాతి సినిమా నువ్వే చేస్తున్నావ్ !’ అని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ సంస్థ తరపున ఓ ప్రముఖ హీరోతో సినిమా చేయబోతున్నాం. కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రకటన వస్తుంది! సినిమా పనులతోపాటూ నా నవదీప్ హాలిడేస్ సంస్థనీ నడుపుతున్నాను. ఏ కొత్త పనైనా సరే అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకోవడం, ఏ పనిచేసినా చేస్తున్నంత సేపూ అదొక్కటే ధ్యాసగా ఉండటం నాకున్న బలాలు. హోటల్లో ప్లేట్లు కడగటంతో జీవితం మొదలుపెట్టిన నేను దర్శకుడిగా మారానంటే ఈ రెండు గుణాలే ప్రధాన కారణమని భావిస్తున్నాను!

7, మార్చి 2020, శనివారం

ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్:

#ఆర్యులు ఈ దేశానికి రాకముందు కుల, మతల్లాంటివేమీ లేవు. సామాజిక అంతరాలూ లేవు. ఈ దేశానికి మొట్టమొదటగా వలస వచ్చిన ఆర్యులు ప్రకృతి ఆరాధన స్థానంలో దేవుళ్ళను, వేదమతం పేరు మీద మతాన్ని సృష్టించారు. వర్ణ వ్యవస్థను సృష్టించారు. వలస వచ్చిన ఆర్యజాతులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులన్నారు; ఈ దేశవాసులందర్నీ శూద్రులన్నారు. శూద్రులను కులాలుగా విభజించిచారు. ఆర్యులపై వీరోచితంగా పోరాడిన శూద్రులను అతి శూద్రులుగా ముద్రవేసారు. శూద్రులకు, అతి శూద్రులకు చదువును నిరాకరించారు. అతిశూద్రులకు చదువుతోపాటు ప్రార్థనాలయాల ప్రవేశాన్నీ నిషేధించి అంటరానివారిగా ముద్రవేసి ఊరి బయట ఉంచారు. సామాజిక అంతరాలకు, కుల విభజన దుర్మార్గానికి చరమగీతం పాడిన బౌద్ధాన్ని ఈ దేశం నుండి తరిమివేసారు. కులవ్యవస్థను, సామాజిక అంతరాలను అలాగే ఉంచడానికి హిందూ రాజులు తమ శక్తి యుక్తులను, పాలనా కాలన్నంతా వినియోగించారు. వేదాల్లో కనబడిన వర్ణవ్యవస్థ భగవద్గీత, మనుధర్మశాస్త్రంలో బలపరచబడి స్థిరీకరణం పొందింది.

ఈ దేశంలో బౌద్ధం ఉన్నతదశలో ఉన్న కాలంలో బౌద్ధ ధర్మంలో అందరికీ ప్రవేశం లభించింది. హిందూ మతంలో శూద్రులకు, అతి శూద్రులకు లేని సామాజిక గౌరవం, ప్రార్థనాలయాల ప్రవేశం, చదువుకునే అవకాశం బౌద్ధ ధర్మంలో ఉన్నాయి. అందుకోసం అతిశూద్రులు ఎక్కువ సంఖ్యలో, శూద్రులు కూడా బౌద్ధంలో చేరారు. బ్రాహ్మణ మతం, శంకరాచార్యాదుల విజృంభణతో బౌద్ధులు ఊచకోతకుగురై, బౌద్ధారామాలు దేవాలయాలుగా మారాయి. తర్వాత ప్రపంచవ్యాప్తమైన బౌద్ధ నైతిక ధర్మం బుద్ధుడు పుట్టిన నేలలో మైనారిటీదైపోయింది. వలస వచ్చిన ఆర్యుల పాలన స్థిరీకరింపబడి బుద్ధభూమి ఆర్యభూమై ఈ దేశవాసులు పాలితులయ్యారు.

బ్రాహ్మణరాజ్యం వచ్చి కులవ్యవస్థ మళ్ళీ విశ్వరూపం దాల్చిన తర్వాత భారతీయులంతా కులాలుగా, అంటరాని వారిగా విడిపోయారు. శూద్రులు, అతి శూద్రులకు చదువు నిరాకరింపబడింది. రాజుల్లోని అంతఃకలహాలు, శైవ వైష్ణవ తగాదాలు, కుల కొట్లాటలు భారతీయులను విభజించి విదేశీయులకు ద్వారాలు తెరిచాయి. ముస్లిం రాజుల కన్ను భారతదేశంపై పడింది. వీరు హిందూ రాజుల్లా కాకుండా శూద్రులకు, అతి శూద్రులకు చదువుకునే అవకాశాలు కల్పించారు. తమ మతంలో చేరిన వారికి అతి శూద్రులకు కూడా ప్రార్ధనాలయాల ప్రవేశాన్ని కల్గించారు. దాంతో హిందూమతంలో అతిశూద్రులుగా ఉన్న వాళ్ళు, శూద్రులు కూడా కొంత మంది ముస్లిం మతాన్ని స్వీకరించారు. మధ్య ఆసియా ప్రాంతంనుంచి వచ్చిన ముస్లిం రాజులు పిడికెడుమందే. మిగితా వాళ్ళంతా మతం మార్చుకున్న దళిత బహుజనులే. ఆర్యులు పాలకులుగా ఇక్కడే ఉండిపోయినా ముస్లిం పాలకులు ఆంగ్లేయులు వచ్చింతర్వాత వెళ్ళిపోయారు. 80 ఏండ్ల ముస్లిం రాజుల పాలనలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 శాతం ముస్లింలలో 95%మందికి మూలాలు భారతీయ మూలజాతుల్లో ఉన్నాయి. శూద్రుల్లో ఉన్నాయి. వీళ్ళంతా భారతీయులే. భారత స్వతంత్ర పోరాటంలో ముస్లింలు ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. అసువులు బాసారు. ఈ దేశాన్ని హృదయానికి హత్తుకున్నారు.

అలాగే బ్రిటిష్‌వారి పాలనా కాలంలో క్రైస్తవులుగా మారినవాళ్ళందరూ శూద్ర, అతి శూద్రకులాలకు చెందినవారే. క్రైస్తవులుగా మారిన దళితులు, శూద్రులు చర్చిలకు వెళ్ళగలిగారు. ఇంగ్లీషు చదువులు చదువుకోగలిగారు. బ్రిటిష్ పాలన ముగిసిం తర్వాత విదేశీ పాలకులు వెళ్ళిపోయారు. భారతీయ మూలాలున్న క్రైస్తవులు ఈ దేశవాసులుగా ఇక్కడే ఉండిపోయారు. ముస్లిం మూలాలు, బ్రిటిష్ మూలలున్న వారు ఈ దేశంలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఇలా మైనారిటీలుగా ఉన్న బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతస్థులంతా ఈ దేశమూలవాసులే.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగంలో సెక్యులర్, సామ్యవాద, గణతంత్ర, సర్వసత్తాక పదాలు చేర్చబడ్డాయి. ఏ మతాన్నయినా అవలంబించే మతస్వేచ్ఛ మనకు రాజ్యాంగంలో పొందుపరుచబడింది. రాజ్యాంగంలో భారతీయ పౌరసత్వ చట్టమూ స్పష్టంగానే ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది గిరిజనులు, ఆదివాసీలు అడవుల్లో నివసిస్తూ ఇప్పటికీ నాగరికతకు దూరంగానే ఉన్నారు. అడవితల్లి ముద్దు బిడ్డలుగా చిరునామాలు లేకుండానే ఉన్నారు. బీసీలుగా చెప్పబడే వాళ్ళలో అనేక మంది సంచార జాతులు చిరునామాలు కూడా లేకుండా సంచార జీవులుగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (CAA-–Citizen Amendment Act) జాతీయ పౌర రిజిస్ట్రేషన్ (NRC-–National Register of Citizens) ల ప్రకారం వీళ్ళంతా భారతీయ పౌరులుగా ఎలా నిరూపించుకుంటారు? ఏ ఆధారాలు చూపుతారు? నిరూపించుకోలేని వారంతా అసోంలోలా శరణార్థ జైలు శిబిరాల్లో మగ్గిపోవాల్సిందేనా? ఇవి ఎంత మందికి దుఃఖదాయకంగా ఉన్నాయో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, ఆ ఆందోళనల్లో మరణిస్తున్న పౌరులను చూస్తే అర్థం కావడం లేదా?

అక్రమ చొరబాటుదారులనుకాని, తీవ్రవాదులనుకాని గుర్తించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవా? తమ దేశంలో, తాము పుట్టిన నేలలో తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలా? తలలను ఈ దేశ నేలకానిస్తూ ప్రార్ధనలు చేసే ముస్లింలు, ఈ దేశ పౌరులు కాకుండా పోతారా? ఈ దేశ మూలవాసుల మూలాలున్నవారే చాలామంది వివక్షను భరించలేక తమకు సామాజిక గౌరవం లభించే మతాల్లో చేరిపోయారు. మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం భారతీయ పౌరులకు కల్పించిన హక్కులు. మతాలు వేరయినంత మాత్రాన వాళ్ళను ఈ దేశ పౌరసత్వం నుండి వేరు చేయడం సరైంది కాదు. హిందువులుగా ఉన్న వలసదారులు కూడా ఈ చట్టాల ద్వారా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి నానా యాతనలు పడాల్సివస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డ్, వోటర్ ఐడెంటిటీ కార్డు, నివాసస్థలం లాంటివి ప్రభుత్వం జారీ చేసినవే ఉన్నప్పుడు నాది ఈ దేశమే అని నిరూపించుకోవడానికి కష్టతరమైన నిబంధనలను పెట్టడం సరైందేనా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా? ‘హిందూదేశ’ మత ఎజెండాను ముందుకు తెచ్చి దేశాన్ని మతదేశంగా మార్చడానికే సిఎఎలు, ఎన్.ఆర్.సి.లు.

మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థితికి ఎదిగిన దశలో దేశాలను మత దేశాలుగా మార్చాలను కోవడం అభివృద్ధి నిరోధకమే. మత తీవ్రవాదంతో పాటు ఏ తీవ్రవాదమూ వద్దు. ప్రజాస్వామ్యమే ముద్దు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతరాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా అమలు చేస్తే ఏ సవరణలూ అవసరంలేదు.

22, జనవరి 2020, బుధవారం

మనుధర్మం

మను ధర్మ శాస్త్రం / ( హిందూ రాజ్యంగం ) /
మనుస్మృతి అసలేం చెప్పింది .....?
 
అంటరాని వారిని చేయడానికి వేసిన కుహానా , కుయూక్తుల రాజ్యాంగాన్ని మంటల్లో కాల్చి బుగ్గి చేసి మనకు ఒక మనిషిగా గుర్తింపును ఇచ్చిన మహానుభావుడు ఒక్కడే .......

     
బాబా సాహెబ్ అంబేడ్కర్ డిసెంబర్ 25 , 1927 న ఎందుకు దుఃఖిస్తూ ఈ మను ధర్మ ( విష్ణు పురాణం ) ( హిందూ రాజ్యంగం ) శాస్త్రాన్ని ఎందుకు తగుల బెట్టాడో ఒకసారి పరిశీలిస్తే ......

        భారతదేశ సమస్త వెనుకబాటుతనానికి కారణమైన కులవ్యవస్థను కట్టుదిట్టం చేసి, కులధర్మమే హిందూ ధర్మంగా ప్రచారం చేసింది మనుధర్మం. కుల ధర్మాన్ని పాటించనివారికి కఠోరమైన శిక్షలు విధించి అసమానతలను పెంచి పోషించి సామాజిక చట్టంగా చెలామణి అయ్యింది మనుధర్మశాస్త్రం. ఒకరకంగా చెప్పాలంటే 1950 వరకు అధికారికంగా, ఆ తర్వాత రాజ్యాంగం అమలైనప్పటికీ, అనధికారికంగా సమాజంలో అమలవుతున్నది
మనుధర్మ శాస్త్రమే. దేశంలోని పాలన, సంపద, వాణిజ్య వ్యాపారాలు, సంస్థలు పరిశ్రమలు నేటికీ బ్రాహ్మణ, బనియా (వైశ్య) కులాల గుత్తాధిపత్యంగా ఉండడమే ఇందుకు ఉదాహరణ.
 స్వాతంత్య్రం సిద్ధించిన 70 ఏళ్లలో 14 మంది ప్రధానులు అగ్రకులానికి చెందినవారు కావడాన్ని ఎలా భావించాలి?

శూద్రులంటే ఎవరు?

శూద్రులంటే 
 బ్రాహ్మణ,
 క్షత్రియ,
 వైశ్యులు కాని మిలిన చాతుర్వర్ణ కులవ్యవస్థకు చెందిన వారు.
       అనగా రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, సాలె, కమ్మరి, కుమ్మరి, ఈడిగ, చాకలి, మంగలి మొదలైన కులాలను శూద్రులు అంటారు.
వీరు ద్విజులు కాదు.

'" బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మనులు ,
బాహువుల నుండి క్షత్రియులు ,
తొడలనుండి వైశ్యులు ,
పాదాలనుండి శూద్రులు పుట్టారు."
 అని ( ఋగ్వేదం 10 - 90 - 12 ) అపౌరుషేయాలని చెప్పబడే వేదాలు పేర్కొంటున్నాయి.....

" భగవద్గీత " 4 వ అధ్యాయం 13 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు కూడా పేర్కొన్నాడు.
మనుధర్మ శాస్త్రం కూడా ఇదే అంశాన్ని 1వ అధ్యాయం 91 వ శ్లోకంలో పేర్కొనబడింది..... సాక్షాత్తు శ్రికృష్ణుడే మనువుకు తాను భోధించినట్లు భగవద్గీత ( 4 - 1 ) లో పేర్కొన్నాడు.
బ్రాహ్మణ మత సామాజిక  వ్యవస్థలో శూద్రుల స్థానం ఏవిధంగా నిర్ధేశించబడింది?

1. " బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )

2. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )

3. " ,బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపద, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )

4. " బ్రాహ్మణులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )

5. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )

6. " బ్రాహ్మణుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )

7. " శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )

8. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )

9. " బ్రాహ్మణునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )

10. "శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి " ( మను 8 - 282)

11. " బ్రహ్మణున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )

12. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )

13. " బ్రాహ్మణుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )

14. " బ్రాహ్మణున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. "
( మను 9 - 335 )

        -- ఇలాంటి ఉదాహరణలు మనుధర్మ శాస్త్ర ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
చాతుర్వర్ణ వ్యవస్థలో పై మూడు వర్ణాలైన

బ్రాహ్మణ,
క్షత్రియ,
వైశ్య వర్ణాల పెత్తనాన్ని తిరుగులేని విధంగా సూత్రీకరించింన మనుధర్మశాస్త్రం.
   
శూద్ర, అతిశూద్ర  కులాను అంటరానివారుగా బానిసలుగా చిత్రీకరించింది.....

శూద్ర, అతిశూద్ర కులాలకు స్వర్గప్రాప్తి కలగాలంటే బ్రాహ్మణులకు సేవ చేసుకోవాలని నిర్ధారించింది. ఈ శ్లోకాన్ని చూడండి! 

‘స్వర్గార్థ ముఖయార్థం వా విప్రానారాధయేత్తు పః జాత బ్రాహ్మణశబ్దస్య సా హ్యస్య కృతకృత్యతా॥

బహుజనులు,  పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గుణదోషాలెంచక శుశ్రూష చేసి జీవనం సాగించాలనే నియమాన్ని విధించింది.

‘ఏకమేవతు శూద్రస్య ప్రభు: కర్మ సమాదిత్‌ ఏతేషామేవ వర్ణానాం శశ్రూషా మనసూయయా॥

శూద్రులు,  అతిశూద్రులు ఎప్పటికీ వెట్టిచాకిరి చేసే వారిగానే ఉండాలి తప్ప, విద్య (నశూద్రాయా మతిందద్యాత్), జ్ఞానం, డబ్బు సంపాదించరాదు

శక్తేనా పిహి శూద్రేణ న కార్యో ధన సంచయ: శూద్రోహి ధన మాసాద్య బ్రాహ్మణానేవ బాధతే॥

ఒకవేళ ఈ నియమాన్ని
పాటి స్తే
  -- వారి చెవుల్లో సీసం పోసి ,
 నాలుకలు తెగకోయాలని (జిహ్వాయా వూపాప్నుయాచ్ఛే దం) నిబద్ధించింది.....
 కేవలం శూద్రులనే కాక స్త్రీలను కూడా
 కడు హీనంగా,
 స్వాతంత్ర్య హీనులుగా,
 అబలలుగా,
పురుషుడికి భగవంతుడు ప్రసాదించిన
 అందమైన వస్తువులుగా,
తమ సేవకులుగా ఉండి తరించాలని ,
వెట్టిచాకిరిని సామాజిక నిష్టం చేసి పూర్తిస్థాయిలో స్త్రీలనుఅణచివేసిందీ
 ఈ మనుస్మృతి  గ్రంథంమే / మనుధర్మశాస్త్రం........

      మనుషులను విడదీసి నిచ్చెనమెట్ల అసమాన కులవ్యవస్థ ద్వారా దళితులను పశువుల కంటే హీనంగా చేసింది. మెజారిటీ ప్రజలైన బహుజనుల వెనుకబాటుతనానికి నూటికినూరు శాతం కారణమైంది. అందుకే బహుజన పితామహులైన ఫూలే మొదలుకొని కాన్షీరాం వరకు మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని పట్టుబట్టడానికి కారణంగా ద్యోతకమవుతున్నది......
Dr.B.R. అంబేడ్కర్ గారు   1927 డిసెంబర్ 25 న  మనుధర్మ శాస్త్ర ప్రతిని తగులబెట్టారు......
స్వేచ్ఛను హరించి ,
అసమానత్వాన్ని పెంచి పోషించి,
 సౌభ్రాతృత్వాన్ని హత్యచేసి అమానుషమైన కులదొంతర సమాజానికి మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టడంనేటికీ సమంజసమేననిపిస్తున్నది.......

ఈ కుల నిర్మూలన జరగనంతకాలం
 ‘మనుస్మృతి దహన దినం’ పాటించవలసే ఉంటుంది.

మతంతో శూద్రులపై జరిపిన ఈ మనుధర్మం అనే ధర్మం న్యాయమైనదేనా?
అలా శాసించి అమలుపరచిన మతం పవిత్రమైనదిగా
 భావించాలా లేక అమానుషమైనదిగా పరిగణిించాలా ......?

బ్రాహ్మణమతం శూద్రులకై చేసిన శాసనాలు

1. " సాంఘిక వ్యవస్థలో శూద్రుడు కట్టకడపటి వాడు."

2. " శూద్రుడు అపవిత్రుడు కాబట్టి అతడు చూస్తూ, వింటూ ఉండగా ఏ పుణ్యకర్మా ఆచరించ కూడదు."

3. " ఇతర వర్ణాలతో పాటుగా శూద్రుణ్ణి గౌరవించాల్సిన పనిలేదు."

4. " శూద్రుని ప్రాణానికి విలువ లేదు. ఎవరైనా ఎలాటి నష్టపరిహారం లేకుండా శూద్రుణ్ణి చంపివేయవచ్చు."

5. " శూద్రుడు జ్ఞానానికి అనర్హుడు. అతనికి విద్యాదానం పాపం."

6. " శూద్రురు ఆస్తి సంపాదించరాదు. బ్రాహ్మణుడు తనకు ఇష్టం వచ్చినపుడు శూద్రుని సంపదను తీసుకోవచ్చును."

7. " శూద్రుడు రాజోద్యోగము చేయకూడదు."

8. " ద్విజవర్ణాల వారికి సేవ చేయడమే శూద్రుని విధి. అదే అతనికి ముక్తిమార్గము."

9. " ద్విజవర్ణాలు శూద్ర స్త్రీలను వివాహం చేసుకోకూడదు. కామమునకు ఉంచుకోవచ్చును.. శూద్రుడు ఉన్నతవర్గాల స్త్రీలను ముట్టుకుంటే మరణశిక్ష."

10. " శూద్రుడు దాస్యం కొరకు పుట్టాడు. అతడిని సర్వదా దాసునిగానే చూడాలి."

శూద్రుని పట్ల బ్రాహ్మణధర్మ శాసనకర్తలు ఇంత కృరమైన వైఖరి ఎందుకు అవలంభించారు?

------ బాబాసాహెబ్ రచనలు :
           సంపుటం - 7 : పేజి - 49

హిందూధర్మంలో శూద్రులు
------------------------------------

1. " శూద్రుడు వేదం వింటే అతడి చెవిలో సీసం పొయ్యాలి. వేదాన్ని ఉచ్చరిస్తే అతని నాలికను కత్తిరించాలి. వేదాన్ని చెబితే వాడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి ." ( గౌతమ : 3 - 4 )

2. " బ్రాహ్మణుని శుశ్రూష నిమిత్తమే శూద్రుడు బ్రహ్మచే సృజించబడెను. గాన, శూద్రున్ని పోషించియు, పోషించకయు నైనను శుశ్రూషచేయించుకొన వచ్చును."
( మనుస్మృతి : 8 - 413 )

3. " శూద్రునికి ఇహపరమునకు పనికివచ్చు అర్థశాస్త్రమును బోధింప రాదు. సేవకుడుకాని శూద్రునకు ఉచ్ఛిష్టాన్నాన్ని కూడా పెట్టరాదు".( మనుస్మృతి : 4 - 80 )

4. " శూద్రుల సమక్షమున వేదాధ్యాయనము చేయరాదు." ( మనుస్మృతి : 4 - 99 )

5. " బ్రాహ్మణుడు సందేహించక శూద్రునికడనుండి ధనము గైకొనవచ్చును. ఏలయన వానికి సొంతమగు ధనమేదియును లేదు. కనుక బలవంతముగా నైనను శూద్రుని ధనమును బ్రాహ్మణుడు గైకొనవచ్చును. అట్టి బ్రాహ్మణునుకి దండన లేదు." ( మనుస్మృతి : 8 - 417 )

6. " పేరాశ, తాగుబోతుతనము, అధైర్యము, కొండెములు చెప్పుట, ఆచారలేమి, యాచించు స్వభావము, ఇవి శూద్రుని గుణములు." ( మనుస్మృతి : 12 - 33 )

7. " బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులకు గుణనింద చేయకుండా శుశ్రూష ( సేవ) చేయడం. " ( మనుస్మృతి : 1 - 91 )

8. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మనుస్మృతి : 10 - 129 )

9. " బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( మనుస్మృతి : 10 - 123 )

10. " బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మనుస్మృతి : 10 - 125 )

11. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మనుస్మృతి : 8 - 272 )

12. " బ్రాహ్మనునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మనుస్మృతి : 8 - 281 )
"శూద్రుడు బ్రాహ్మణున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. " ( మనుస్మైతి : 8 - 282)

14. " ఎ శూద్రుడైనా బ్రాహ్మణునికి ఎదురు మాట్లాడునో వాడి నోటిలో, చెవులలో మసలుతున్న నూనె పోయవలెను." ( మనుస్మృతి : 8 - 272 )

15. " శూద్రుడు ఆస్థి సంపాదించ రాదు. అది బ్రాహ్మణునికి అపకారం కలొగిస్తుంది." ( మనుస్మృతి : 10 - 129 )

శూద్రులు అంటే నేటి BC లు. బ్రిటిష్ వారు వచ్చేవరకు ఇవే శాసనాలు బ్రాహ్మణులు అమలుపరిచారు. ఇప్పటికైనా

నా శూద్రులు ( BC లు) నిజనిజాలు గ్రహించాలి.
 హిందూధర్మంలో బ్రాహ్మణులు
-----------------------------------------

1. " బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సర్వజగద్రక్షణములకై తన ముఖం నుండి పుట్టించెను." ( మనుస్మృతి : 1 - 94 )

2. " సకల చరాచర రాసులలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రతి అణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠులు. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ష్ఠులు." ( మనుస్మృతి : 1 - 96 )

3. " ఉత్తమాంగమయిన ముఖం నుండి పుట్టుట వలనను, వేదములను ధరించుట వలనను, మిగిలిన వర్ణములకు ధర్మోపదేశార్హత వల్లను బ్రాహ్మణుఉ అన్ని వర్ణములకు ప్రభువు అగుచున్నాడు. " ( మనుస్మృతి : 1 - 93 )

4. " బ్రాహ్మణులు పుట్టుచునే భూమియందు అందరికంటే గొప్పవాడుగా పుట్టియున్నాడు. సకల ప్రాణుల సమూహమునకు సంబంధించిన ధర్మ సమూహ సంరక్షణకు ప్రభువు. " ( మనుస్మృతి : 1 - 99 ).

5. " భూతలమందున్న సమస్తమూ బ్రాహ్మణుడిదే. బ్రహ్మ ముఖము నుండి జన్మించుట చేతను, వర్ణమున ఉత్తమవర్ణం అగుట చేతను బ్రాహ్మణుడు సర్వ ధనమునకు అర్హుడు అగుచున్నాడు." ( మనుస్మృతి : 1 - 100 )

6. " ఈ భూమియందున్న సంపద అంతా బ్రాహ్మణునిదే. ఇతరులందరూ కూడా బ్రాహ్మణుని సంపదనే అనుభవించు చున్నారు." ( మనుస్మృతి : 1 - 100)

7. " ఎన్ని పాపాలు చేసినప్పటికి బ్రహ్మణున్ని ఎప్పుడూ చంపరాదు. వాని ధనమును వానికొసంగి, శారీరకంగా బాధింపక దేశం నుండి పంపించాలి." ( మనుస్మృతి : 8 - 380 )

8. " లోకమున బ్రాహ్మణ వధ కంటే మించిన గొప్ప అధర్మం మరొకటి ఏదీ లేదు. బ్రాహ్మణున్ని చంపుట మనస్సులో కూడా తలంచకూడదు." ( మనుస్మృతి : 8 - 381 )

9. " ఉపయోగపడినా, ఉపయోగపడకపోయినా అగ్ని ఎట్లు మహిమాన్వితమో అట్లే పండితుడైనా, మూర్ఖుడైనా బ్రాహ్మణుడు ప్రకృష్టమైన దేవుడే." ( మనుస్మృతి : 9 - 317 )

10. " బ్రాహ్మణుడు ముల్లోకాల ప్రజలను పీడించినప్పటికి , అనేక పాపములు చేసినప్పటికి, వేదములు కలగియుండుట వలన పాపమును పొందడు. " ( మనుస్మృతి : 11 - 261 )

11. " బ్రాహ్మణులు ఎన్ని నీచకార్యములు చేసినప్పటికి వారు సర్వవిధముల పూజ్యులే అగుదురు. వారు ఎల్లప్పుడు పరమోత్మ దేవతలే అగుదురు." ( మనుస్మృతి : 9 - 319 )........
 
   
ఇప్పుడు చెప్పండి .........

భారత రాజ్యాంగం కావాలా ?

లేక

మనుస్మృతి ( మను ధర్మ శాస్త్రం / హిందూ ధర్మ శాస్త్రం )  కావాలా ? ....