ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్:
#ఆర్యులు ఈ దేశానికి రాకముందు కుల, మతల్లాంటివేమీ లేవు. సామాజిక అంతరాలూ లేవు. ఈ దేశానికి మొట్టమొదటగా వలస వచ్చిన ఆర్యులు ప్రకృతి ఆరాధన స్థానంలో దేవుళ్ళను, వేదమతం పేరు మీద మతాన్ని సృష్టించారు. వర్ణ వ్యవస్థను సృష్టించారు. వలస వచ్చిన ఆర్యజాతులను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులన్నారు; ఈ దేశవాసులందర్నీ శూద్రులన్నారు. శూద్రులను కులాలుగా విభజించిచారు. ఆర్యులపై వీరోచితంగా పోరాడిన శూద్రులను అతి శూద్రులుగా ముద్రవేసారు. శూద్రులకు, అతి శూద్రులకు చదువును నిరాకరించారు. అతిశూద్రులకు చదువుతోపాటు ప్రార్థనాలయాల ప్రవేశాన్నీ నిషేధించి అంటరానివారిగా ముద్రవేసి ఊరి బయట ఉంచారు. సామాజిక అంతరాలకు, కుల విభజన దుర్మార్గానికి చరమగీతం పాడిన బౌద్ధాన్ని ఈ దేశం నుండి తరిమివేసారు. కులవ్యవస్థను, సామాజిక అంతరాలను అలాగే ఉంచడానికి హిందూ రాజులు తమ శక్తి యుక్తులను, పాలనా కాలన్నంతా వినియోగించారు. వేదాల్లో కనబడిన వర్ణవ్యవస్థ భగవద్గీత, మనుధర్మశాస్త్రంలో బలపరచబడి స్థిరీకరణం పొందింది.
ఈ దేశంలో బౌద్ధం ఉన్నతదశలో ఉన్న కాలంలో బౌద్ధ ధర్మంలో అందరికీ ప్రవేశం లభించింది. హిందూ మతంలో శూద్రులకు, అతి శూద్రులకు లేని సామాజిక గౌరవం, ప్రార్థనాలయాల ప్రవేశం, చదువుకునే అవకాశం బౌద్ధ ధర్మంలో ఉన్నాయి. అందుకోసం అతిశూద్రులు ఎక్కువ సంఖ్యలో, శూద్రులు కూడా బౌద్ధంలో చేరారు. బ్రాహ్మణ మతం, శంకరాచార్యాదుల విజృంభణతో బౌద్ధులు ఊచకోతకుగురై, బౌద్ధారామాలు దేవాలయాలుగా మారాయి. తర్వాత ప్రపంచవ్యాప్తమైన బౌద్ధ నైతిక ధర్మం బుద్ధుడు పుట్టిన నేలలో మైనారిటీదైపోయింది. వలస వచ్చిన ఆర్యుల పాలన స్థిరీకరింపబడి బుద్ధభూమి ఆర్యభూమై ఈ దేశవాసులు పాలితులయ్యారు.
బ్రాహ్మణరాజ్యం వచ్చి కులవ్యవస్థ మళ్ళీ విశ్వరూపం దాల్చిన తర్వాత భారతీయులంతా కులాలుగా, అంటరాని వారిగా విడిపోయారు. శూద్రులు, అతి శూద్రులకు చదువు నిరాకరింపబడింది. రాజుల్లోని అంతఃకలహాలు, శైవ వైష్ణవ తగాదాలు, కుల కొట్లాటలు భారతీయులను విభజించి విదేశీయులకు ద్వారాలు తెరిచాయి. ముస్లిం రాజుల కన్ను భారతదేశంపై పడింది. వీరు హిందూ రాజుల్లా కాకుండా శూద్రులకు, అతి శూద్రులకు చదువుకునే అవకాశాలు కల్పించారు. తమ మతంలో చేరిన వారికి అతి శూద్రులకు కూడా ప్రార్ధనాలయాల ప్రవేశాన్ని కల్గించారు. దాంతో హిందూమతంలో అతిశూద్రులుగా ఉన్న వాళ్ళు, శూద్రులు కూడా కొంత మంది ముస్లిం మతాన్ని స్వీకరించారు. మధ్య ఆసియా ప్రాంతంనుంచి వచ్చిన ముస్లిం రాజులు పిడికెడుమందే. మిగితా వాళ్ళంతా మతం మార్చుకున్న దళిత బహుజనులే. ఆర్యులు పాలకులుగా ఇక్కడే ఉండిపోయినా ముస్లిం పాలకులు ఆంగ్లేయులు వచ్చింతర్వాత వెళ్ళిపోయారు. 80 ఏండ్ల ముస్లిం రాజుల పాలనలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 12 శాతం ముస్లింలలో 95%మందికి మూలాలు భారతీయ మూలజాతుల్లో ఉన్నాయి. శూద్రుల్లో ఉన్నాయి. వీళ్ళంతా భారతీయులే. భారత స్వతంత్ర పోరాటంలో ముస్లింలు ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. అసువులు బాసారు. ఈ దేశాన్ని హృదయానికి హత్తుకున్నారు.
అలాగే బ్రిటిష్‌వారి పాలనా కాలంలో క్రైస్తవులుగా మారినవాళ్ళందరూ శూద్ర, అతి శూద్రకులాలకు చెందినవారే. క్రైస్తవులుగా మారిన దళితులు, శూద్రులు చర్చిలకు వెళ్ళగలిగారు. ఇంగ్లీషు చదువులు చదువుకోగలిగారు. బ్రిటిష్ పాలన ముగిసిం తర్వాత విదేశీ పాలకులు వెళ్ళిపోయారు. భారతీయ మూలాలున్న క్రైస్తవులు ఈ దేశవాసులుగా ఇక్కడే ఉండిపోయారు. ముస్లిం మూలాలు, బ్రిటిష్ మూలలున్న వారు ఈ దేశంలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఇలా మైనారిటీలుగా ఉన్న బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ మతస్థులంతా ఈ దేశమూలవాసులే.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగంలో సెక్యులర్, సామ్యవాద, గణతంత్ర, సర్వసత్తాక పదాలు చేర్చబడ్డాయి. ఏ మతాన్నయినా అవలంబించే మతస్వేచ్ఛ మనకు రాజ్యాంగంలో పొందుపరుచబడింది. రాజ్యాంగంలో భారతీయ పౌరసత్వ చట్టమూ స్పష్టంగానే ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది గిరిజనులు, ఆదివాసీలు అడవుల్లో నివసిస్తూ ఇప్పటికీ నాగరికతకు దూరంగానే ఉన్నారు. అడవితల్లి ముద్దు బిడ్డలుగా చిరునామాలు లేకుండానే ఉన్నారు. బీసీలుగా చెప్పబడే వాళ్ళలో అనేక మంది సంచార జాతులు చిరునామాలు కూడా లేకుండా సంచార జీవులుగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (CAA-–Citizen Amendment Act) జాతీయ పౌర రిజిస్ట్రేషన్ (NRC-–National Register of Citizens) ల ప్రకారం వీళ్ళంతా భారతీయ పౌరులుగా ఎలా నిరూపించుకుంటారు? ఏ ఆధారాలు చూపుతారు? నిరూపించుకోలేని వారంతా అసోంలోలా శరణార్థ జైలు శిబిరాల్లో మగ్గిపోవాల్సిందేనా? ఇవి ఎంత మందికి దుఃఖదాయకంగా ఉన్నాయో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, ఆ ఆందోళనల్లో మరణిస్తున్న పౌరులను చూస్తే అర్థం కావడం లేదా?
అక్రమ చొరబాటుదారులనుకాని, తీవ్రవాదులనుకాని గుర్తించడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవా? తమ దేశంలో, తాము పుట్టిన నేలలో తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలా? తలలను ఈ దేశ నేలకానిస్తూ ప్రార్ధనలు చేసే ముస్లింలు, ఈ దేశ పౌరులు కాకుండా పోతారా? ఈ దేశ మూలవాసుల మూలాలున్నవారే చాలామంది వివక్షను భరించలేక తమకు సామాజిక గౌరవం లభించే మతాల్లో చేరిపోయారు. మత స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం భారతీయ పౌరులకు కల్పించిన హక్కులు. మతాలు వేరయినంత మాత్రాన వాళ్ళను ఈ దేశ పౌరసత్వం నుండి వేరు చేయడం సరైంది కాదు. హిందువులుగా ఉన్న వలసదారులు కూడా ఈ చట్టాల ద్వారా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి నానా యాతనలు పడాల్సివస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డ్, వోటర్ ఐడెంటిటీ కార్డు, నివాసస్థలం లాంటివి ప్రభుత్వం జారీ చేసినవే ఉన్నప్పుడు నాది ఈ దేశమే అని నిరూపించుకోవడానికి కష్టతరమైన నిబంధనలను పెట్టడం సరైందేనా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా? ‘హిందూదేశ’ మత ఎజెండాను ముందుకు తెచ్చి దేశాన్ని మతదేశంగా మార్చడానికే సిఎఎలు, ఎన్.ఆర్.సి.లు.
మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థితికి ఎదిగిన దశలో దేశాలను మత దేశాలుగా మార్చాలను కోవడం అభివృద్ధి నిరోధకమే. మత తీవ్రవాదంతో పాటు ఏ తీవ్రవాదమూ వద్దు. ప్రజాస్వామ్యమే ముద్దు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారతరాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా అమలు చేస్తే ఏ సవరణలూ అవసరంలేదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి